CM Revanth Reddy: రాబోయే పదేళ్లు సీఎం పదవిలోనే ఉంటాను.. ఎందుకంటే?: రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని కేసీఆర్‌ అంటున్నారని, ఎలా వస్తారో తానూ చూస్తానని అన్నారు.

CM Revanth Reddy: రాబోయే పదేళ్లు సీఎం పదవిలోనే ఉంటాను.. ఎందుకంటే?: రేవంత్ రెడ్డి

Revanth Reddy

రాబోయే పదేళ్లు తాను తెలంగాణ ముఖ్యమంత్రి పదవిలోనే ఉంటానని రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో పోలీస్ కానిస్టేబుల్స్‌కు నియామక పత్రాలు అందించే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. నిరుద్యోగులు బలవన్మరణాలు చేసుకునే పరిస్థితి నుంచి బయట పడేయాలనే తమ ప్రయత్నమని చెప్పారు.

తాను పదేళ్లు ఈ బాధ్యతలోనే ఉంటానని, 24 గంటలూ కష్టపడి పనిచేస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు. అంతేగాక, తమను ఆశీర్వదిస్తే మరో పదేళ్లు ఇందిరమ్మ రాజ్యం ఉంటుందని చెప్పారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని కేసీఆర్‌ అంటున్నారని, ఎలా వస్తుందో తానూ చూస్తానని అన్నారు.

గత పాలకులు తమ కుటుంబం కోసం ఆలోచించారు తప్ప నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించలేదని రేవంత్ రెడ్డి తెలిపారు. తమ కుటుంబం 4 కోట్ల తెలంగాణ ప్రజలని చెప్పారు. అందుకే తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించే బాధ్యత తీసుకున్నామని తెలిపారు.

న్యాయపరమైన చిక్కులు తొలగించి నియామక పత్రాలు అందిస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. తమ ప్రభుత్వం పేదల ప్రభుత్వం.. ప్రజా ప్రభుత్వం అని అన్నారు. ఆనాటి ప్రభుత్వం వేసిన చిక్కుముడులను ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ ముందుకు వెళుతున్నామని చెప్పారు.

ముందేమో బీజేపీ వదినమ్మ, వెనకేమో కాంగ్రెస్ చెల్లెమ్మ.. చంద్రబాబుపై కొడాలి నాని సెటైర్లు