ముందేమో బీజేపీ వదినమ్మ, వెనకేమో కాంగ్రెస్ చెల్లెమ్మ.. చంద్రబాబుపై కొడాలి నాని సెటైర్లు

చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వచ్చి 7 రోజులు అయ్యింది. వాళ్ల దెబ్బకు మంచం మీద పడినట్లు ఉన్నాడు. హైదరాబాద్ నుంచి బయటకు రావడం లేదు.

ముందేమో బీజేపీ వదినమ్మ, వెనకేమో కాంగ్రెస్ చెల్లెమ్మ.. చంద్రబాబుపై కొడాలి నాని సెటైర్లు

YCP MLA Kodali Nani Sensational Comments On Chandrababu Naidu

Kodali Nani : టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. సెటైర్లు కూడా వేశారు. చంద్రబాబుకి ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము లేదన్న కొడాలి నాని.. చంద్రబాబు తన ముందేమో బీజేపీ వదినమ్మను, వెనకేమో కాంగ్రెస్ చెల్లెమ్మను అడ్డు పెట్టుకున్నారని విమర్శించారు. టీడీపీ, బీజేపీ పొత్తుల అంశంపైనా కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా చేసిన ప్రతిపాదనతో చంద్రబాబు పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా మారిందన్నారు. 150 అసెంబ్లీ సీట్లలో బీజేపీ, 25 స్థానాల్లో టీడీపీ పోటీ చేయాలని చంద్రబాబు ముందు అమిత్ షా ప్రతిపాదన ఉంచి ఉంటారని కొడాలి నాని అభిప్రాయపడ్డారు.

”కుట్రలు, కుతంత్రాలు, చెల్లెమ్మ, వదినమ్మ, దత్తపుత్రుడు, పనికి రాని వాళ్లను ఎంతమందిని వేసుకొచ్చినా.. ఏమీ ఒరిగేది లేదు. మీరంతా అప్రమత్తంగా ఉండండి. ప్రతి నిమిషం కూడా మీ కోసం తపిస్తున్నారు జగన్. ధైర్యంగా దమ్ముగా చెప్పగలిగిన వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నారా.. జగన్ మోహన్ రెడ్డిని తప్పించి.. జగన్ నన్ను చూసి భయపడతాడని చంద్రబాబు అంటారు. రా మరి చూసుకుందాం అంటే.. పక్కన దత్తపుత్రుడు ఉన్నాడో లేదో చూసుకుంటాడు. మరో పక్క ఉత్త పుత్రుడు ఉన్నాడో లేదో చూసుకుంటాడు.

Also Read : ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌.. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యల వెనుక పక్కా ప్లాన్?

వీళ్లు సరిపోరు.. వదినమ్మ ముందు ఉండాలి. వీళ్లంతా ఉన్నారు అంటే.. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ చెల్లెమ్మను తెచ్చుకున్నాడు. వెనకాల పెట్టుకున్నాడు. ముందేమో బీజేపీ వదినమ్మ, వెనకేమో కాంగ్రెస్ చెల్లెమ్మ.. ఈ పక్కనేమో ఉత్తపుత్రుడు, ఆ పక్కనేమో దత్తపుత్రుడు.. బయల్దేరు వెళ్దాం అంటే వెళ్లి హైదరాబాద్ లో కూర్చున్నాడు. ఎన్నికలకు నెల 15 రోజులు ఉంటాయి.

అమిత్ షా ఏం చెప్పాడో. నువ్వు పాతిక తీసుకోని నాకు 150 సీట్లు ఇమ్మని చెప్పినట్లు ఉన్నాడు. అప్పుడంటే.. అద్వానీ, వాజ్ పేయీ ఉండేవారు. చంద్రబాబు ఏం చెబితే ఆ కథలన్నీ వినేవాళ్లు. ఇప్పుడున్నది అమిత్ షా, మోదీ.. వాళ్లేం వింటారు? మేము 150 అసెంబ్లీ, 20 ఎంపీ సీట్లలో పోటీ చేస్తాం. నువ్వు పాతిక అసెంబ్లీ, 5 ఎంపీ పోటీ చేసుకో అని చంద్రబాబుతో చెప్పినట్లు ఉన్నారు. ఇందుకు అవును అంటే ఒక ప్రాబ్లమ్, కాదు అంటే మరొక ప్రాబ్లమ్. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వచ్చి 7 రోజులు అయ్యింది. వాళ్ల దెబ్బకు మంచం మీద పడినట్లు ఉన్నాడు. హైదరాబాద్ నుంచి బయటకు రావడం లేదు. ముందు గొయ్యి, వెనుక నుయ్యి.. అవునని చెప్పలేడు, కాదని చెప్పలేడు. కాదని చెప్పి ముందుకెళితే భయంకరమైన దాడి ఉంటుంది. అవును అని చెబితే ఇది తోక పార్టీ అవుతుంది” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని.

Also Read : మరో ఛాన్స్ లేనట్లేనా? ఆ ఇద్దరు మహిళా ఎంపీల రాజకీయ భవిష్యత్‌‌పై సందేహాలు

హెలికాప్టర్ కావాలంటున్న పవన్ కల్యాణ్, భీమవరం ప్రజలు ఆలోచించుకోవాలి- కొడాలి నాని
”పవన్ కల్యాణ్.. విజయవాడ నుంచి భీమవరం వెళ్లడానికి హెలికాప్టర్ మాట్లాడుకున్నాడట. కాలేజీ బిల్డింగ్ ల మధ్య దిగిపోతాడట. ఆర్ అండ్ బీ, ఫైర్ డిపార్ట్ మెంట్ వాళ్లు నో చెప్పారు. రెక్క ఏదైనా తగిలి ప్రమాదం జరుగుతుంది, ఆ తర్వాత ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. మేము ఏదో చేశామని అంటారు. కాబట్టి, ఊరి బయట ఎక్కడైనా దిగు అని చెబితే.. అందుకు పవన్ ఒప్పుకోలేదు. మంగళగిరిలోనే కూర్చున్నాడు. పవన్ కల్యాణ్ జనంలోకి వెళితే అడుగుతారు. మనం ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నాం. ఏయే సీట్లలో పోటీ చేస్తున్నాం అని కార్యకర్తలు, నాయకులు అడుగుతారు. దానికి పవన్ కల్యాన్ సమాధానం చెప్పలేడు.

పవన్ సమాధానం చెప్పాలంటే ఢిల్లీ వాళ్లు చెప్పాలి. ఇవన్నీ తప్పించుకోవడానికే పవన్ కల్యాణ్ నాటకాలు ఆడుతున్నాడు. విజయవాడ నుంచి భీమవరం వెళ్లడానికి ఎంత సమయం పడుతుంది. కారులో గంటన్నరలో వెళ్లొచ్చు. రేపు భీమవరంలో పోటీ చేసి గెలిచాక భీమవరం వెళ్లాలంటే హెలికాప్టర్ ల్యాండింగ్ అయితేనే వెళ్తాను అంటారా? కాబట్టి భీమవరం ప్రజలు ఆలోచించుకోవాలి. హెలికాప్టర్ లేకపోతే మీ ఎమ్మెల్యే వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి భీమవరం ప్రజలు ఆలోచించుకోవాలి” అని ఎద్దేవా చేశారు కొడాలి నాని.

 

చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై కొడాలి నాని కామెంట్స్..
* జగన్ ను ఒంటరిగా ఎదుర్కోలేక చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు
* బీజేపీ వదినమ్మ, కాంగ్రెస్ చెల్లెమ్మతో చంద్రబాబు కుట్రలు
* ఉత్తపుత్రుడు, దత్తపుత్రుడు.. వీళ్లంతా ఉన్న సరిపోక చంద్రబాబు ఢిల్లీ పెద్దల వద్దకు వెళ్లారు
* ఢిల్లీ పెద్దల దెబ్బతో చంద్రబాబు పరిస్థితి ముందు గొయ్యి, వెనుక నుయ్యిలా తయారైంది
* హెలికాప్టర్ లేకపోతే పవర్ కల్యాణ్ భీమవరం వెళ్లలేరా?
* ఎన్ని సీట్లలో పోటీ చేస్తారని జనసేన క్యాడర్ ప్రశ్నిస్తుందనే భయంతోనే పవన్ కల్యాణ్ హెలికాప్టర్ డ్రామా ఆడుతున్నారు.