BRICS Summit: మోదీ అధ్యక్షతన 13వ బ్రిక్స్ సదస్సు
బ్రిక్స్ సదస్సులో భాగంగా జరగనున్న సమావేశంలో ఆరు దేశాల ప్రధానులు వర్చువల్ మీటింగ్ లో హాజరుకానున్నారు. 13వ బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ఈ కార్యక్రమం జరగనుంది.

Brics Meet
BRICS Summit: బ్రిక్స్ సదస్సులో భాగంగా జరగనున్న సమావేశంలో ఆరు దేశాల ప్రధానులు వర్చువల్ మీటింగ్ లో హాజరుకానున్నారు. 13వ బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ఈ కార్యక్రమం జరగనుంది. 2012, 2016 తర్వాత బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు భారత్ ఆతిథ్యమివ్వటం ఇది మూడోసారి. ఈ సమావేశానికి భారత ప్రధాని మోదీ, బ్రిజిల్, రష్యా, చైనాతోపాటు సౌతాఫ్రికా అధ్యక్షులు హాజరుకానున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న కరోనా, ఆర్థికంగా పుంజుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, ఆఫ్ఘన్ లో తాలిబన్ పాలనపై వస్తున్న విమర్శలు, అక్కడి ప్రజకు అందించాల్సిన చేయూత తదితర విషయాలపై బ్రిక్స్ సదస్సలో చర్చించబోతున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులు, పర్యావరణం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ఈ సదస్సులో మాట్లాడే అవకాశం ఉంది.
PM #NarendraModi to chair 13th BRICS summit today pic.twitter.com/Krj6hjleTH
— NewsNowNation (@NewsNowNation) September 9, 2021
అంతేకాకుండా బిజినెస్ రంగంలో మహిళల గుర్తింపుపై కూడా సదస్సులో చర్చించే అవకాశం ఉంది. ఈ సదస్సులో బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సొనారో, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా పాల్గొననున్నారు. ఐదు సభ‌్య దేశాలకు ప్రయోజనకరమైన విషయాలను సదస్సులో ప్రస్తావిస్తారు.