PM Modi UAE Tour : ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ప్రధాని మోదీ యూఏఈ పర్యటన రద్దు

ప్రధాని మోదీ యూఏఈ, కువైట్ పర్యటన వాయిదా పడింది. ఒమిక్రాన్ వేరియంట్ కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా మోదీ పర్యటన వాయిదా పడింది.

PM Modi UAE Tour : ప్రధాని మోదీ యూఏఈ, కువైట్ పర్యటన వాయిదా పడింది. ఒమిక్రాన్ వేరియంట్ కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా మోదీ పర్యటన వాయిదా పడింది. ఫిబ్రవరిలో మోదీ యూఏఈలో పర్యటించే అవకాశం ఉంది. కాగా, షెడ్యూల్ ప్రకారం ప్రధాని మోదీ జవనరి 6న యూఏఈ, కువైట్ లో పర్యటించాల్సి ఉంది.

Scientists Warning: అంతరిక్షంలోకి మనుషులు వెళితే చంపుకుతినడం ఖాయం: శాస్త్రవేత్తలు

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ కంటిమీద కనుకు లేకుండా చేస్తోంది. క్రమంగా అన్ని దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. అమెరికా, యూరప్ లో ఒమిక్రాన్ తీవ్రత అధికంగా ఉంది. వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ కారణంగా యూకేలో రికార్డు స్థాయిలో రోజువారీ కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి.

Mark Zuckerberg: వ్యవసాయంలోకి మార్క్ జూకర్‌బర్గ్, రూ.127కోట్లతో స్థలం కొనుగోలు

భారత్ లోనూ ఒమిక్రాన్ కలవరం రేపింది. దేశంలో దాదాపు 800 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. తొలుత సౌతాఫ్రికాలో నవంబర్ 24న వెలుగుచూసిన ఒమిక్రాన్.. వేగంగా వ్యాపిస్తూ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. యూఏఈలో ఒక్కరోజే 1,732 కరోనా కేసులు నమోదవగా, ఒకరు కరోనాతో చనిపోయారు. యూఏఈలో ఇప్పటివరకు 7లక్షల 55వేల కరోనా కేసులు నమోదవగా.. 2వేల 160మంది కరోనాతో చనిపోయారు. ప్రస్తుతం 10వేల 186 యాక్టివ్ కేసులున్నాయి.

ప్రపంచ దేశాల్లో వణుకు పుట్టిస్తున్న ఒమిక్రాన్.. భారత్‌లోనూ ప్రతాపం చూపిస్తోంది. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త వేరియంట్ వ్యాప్తి చెందింది. క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 781 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 241 మంది కోలుకున్నారు.

ఢిల్లీలో అత్యధికంగా 238 కేసులు నమోదయ్యాయి. 167 కేసులతో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. అటు కేరళలో 57, తెలంగాణలో 63 వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి. ఇక దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 9వేల 195 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 44 శాతం కంటే ఎక్కువ.

ట్రెండింగ్ వార్తలు