Pope Francis funeral
Pope Francis Funeral : క్యాథలిక్ క్రైస్తవ మఠాధిపతి పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. 88 ఏళ్ల పోప్ ఫ్రాన్సిస్ ఏప్రిల్ 21న స్ట్రోక్ తర్వాత గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు శనివారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు వాటికన్‌లోని సెయింట్ పీటర్స్ బసిలికా ముందు ఉన్న గ్రాండ్ బరోక్ ప్లాజాలో మొదలయ్యాయి.
భారత కాలమానం ప్రకారం.. ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. పోప్ మరణం అనంతరం ప్రపంచం నలుమూలల నుంచి ఆయనకు పార్థీవ దేహానికి నివాళులు అర్పించేందుకు తరలివస్తున్నారు. వాటికన్ ప్రకారం.. శుక్రవారం వరకు 3 రోజుల్లో, దాదాపు 2.5 లక్షల మంది సెయింట్ పీటర్స్ బసిలికాను సందర్శించి పోప్ ఫ్రాన్సిస్‌కు నివాళులర్పించారు.
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దేశాధినేతలు పోప్ అంత్యక్రియలకు హాజరవుతున్నారు. సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో ప్రపంచవ్యాప్తంగా భారీగా తుది వీడ్కోలు కార్యక్రమం జరగనుంది. దాదాపు 2లక్షల మంది సంతాపకులు, 50 మందికి పైగా ప్రపంచ నేతలు తరలి రానున్నారు.
పోప్ అంత్యక్రియల సందర్భంగా వాటికన్‌లో 9 రోజుల అధికారిక సంతాప దినాలు ప్రారంభమవుతాయి. పోప్ ఫ్రాన్సిస్‌ను రోమ్‌లోని సెయింట్ మేరీ మేజర్ బసిలికా వద్ద సాధారణ సమాధిలో ఖననం చేస్తారు. 2015లో ఫిలిప్పీన్స్‌కు పర్యటించిన వాహనంలో ఆయన పార్థీవ పేటికను 4 కిలోమీటర్ల ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ అంత్యక్రియల్లో ప్రజలను కూడా వీక్షించేందుకు అనుమతిస్తారు.
లక్షా 40వేల మంది హాజరు :
పోప్ అంత్యక్రియలకు లక్షలాది మంది తరలివచ్చారు. దాదాపు లక్షా 40వేల మంది హాజరైనట్లు తెలుస్తోంది. ఇందులో 170 దేశాల ప్రతినిధులు ఉన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా హాజరయ్యారు. వీరిలో భారత అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిల్లీ, బ్రిటిష్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఉన్నారు.
Pope Francis funeral ( Photo Credit : Google Images)
పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు హాజరైన ట్రంప్ భార్య మెలానియాతో కలిసి నివాళులర్పించారు. అంత్యక్రియల తరువాత పోప్ సాధారణ చెక్క శవపేటికను నెమ్మదిగా రోమ్‌లోని శాంటా మారియా మాగ్గియోర్ బసిలికాకు తీసుకెళ్తారు. అక్కడ ఆయన భౌతికకాయాన్ని ఖననం చేస్తారు.
The Pope’s coffin has been sealed.
It was a private ceremony, attended by Vatican officials and some of the Pope’s family members.
Now that the ceremony is over, the Chapter of St Peter will hold a prayer vigil by the coffin all night, until the Pope’s funeral begins tomorrow… pic.twitter.com/KHZouef47f
— Vatican News (@VaticanNews) April 25, 2025
సెయింట్ పీటర్స్ స్క్వేర్ నుంచి దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. గత 100 ఏళ్లలో వాటికన్ వెలుపల ఖననం చేసిన మొదటి పోప్ అవుతారు. పోప్ ఏప్రిల్ 21న 88 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు. గత మూడు రోజులుగా, ఆయన భౌతికకాయాన్ని సెయింట్ పీటర్స్ బసిలికాలో శవపేటికలో సందర్శనార్థం ఉంచారు.
పోప్ తుది వీడ్కోలుకు ట్రాన్స్‌జెండర్లు :
వాటికన్ న్యూస్ ప్రకారం.. పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు తుది వీడ్కోలు పలికేందుకు సెయింట్ పీటర్స్ బసిలికా మెట్లపై గౌరవ రక్షకుడిగా 40 మందిలో కొంతమంది ట్రాన్స్‌జెండర్లు కూడా ఉన్నారు. పోప్ ఫ్రాన్సిస్ శవపేటికను ఖననం చేసే ముందు ఆయనకు వీడ్కోలు పలికే చివరి అవకాశం వీరికి కల్పించారు. పోప్ అంత్యక్రియల సందర్భంగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మహ్మద్ యూనస్‌ను అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కలిశారు.
పోప్‌కు ప్రధాని మోదీ నివాళులు :
ప్రపంచం పోప్ ఫ్రాన్సిస్ సేవలను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత ప్రజల తరపున రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పోప్ ఫ్రాన్సిస్‌కు నివాళులర్పించారు. ఈ మేరకు పోప్ మృతికి నివాళి అర్పిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌వేదికగా పోస్ట్ చేశారు.