‘I Am A Stripper’:అమ్మా..నేను పోల్ డాన్సర్ జాబ్ చేస్తున్నా..

ఓ పోల్ డ్యాన్సర్ తాను పోల్ డ్యాన్సింగ్ క్లబ్‌లో పని చేస్తున్నానని తన తల్లిదండ్రులకు తెలియజేయడానికి వినూత్నంగా చెప్పటం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

‘I Am A Stripper’:అమ్మా..నేను పోల్ డాన్సర్ జాబ్ చేస్తున్నా..

'i Am A Stripper

Updated On : September 4, 2021 / 3:50 PM IST

‘I Am A Stripper’: ఓ పోల్ డ్యాన్సర్ తాను పోల్ డ్యాన్సింగ్ క్లబ్‌లో పని చేస్తున్నానని తన తల్లిదండ్రులకు తెలియజేయడానికి వినూత్నంగా చెప్పటం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లెక్స్ అనే యువతి తాను ఇంతకాలంలో రహస్యంగా ఉంచిన తన పోల్ డాన్స్ ఉద్యోగం గురించి తన తల్లిదండ్రులకు చెప్పటానికి పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌ ద్వారా వెల్లడించింది.

పోర్ట్ ల్యాండ్ కు చెందిన లెక్స్ అనే యువతి తాను చేస్తున్న పోల్ డాన్స్ ఉద్యోగం గురించి ఇప్పటి వరకూ తన తల్లిదండ్రులకు చెప్పలేదు. కానీ చెప్పకుండా ఉండలేకపోయింది. ఈ విషయం తెలిస్తే వారు ఏమనుకుంటారో అని ఆందోళన పడింది.

పోల్ డాన్స్ అంటే అదొక చెడ్డపని అనే అనుకుంటారు. కానీ ఇది చెడ్డ పని కానే కాదు. నేను ఒక పోల్ డాన్సర్ ని అచెప్పుకోవటానికి ఏమాత్రం సిగ్గు పడటంలేదని లెక్స్ స్పష్టంచేసింది. నేను ఒక ఒక స్ట్రిప్పర్ అని గర్వంగా ప్రకటించింది. తాను పోల్ డాన్సర్ ని అని టిక్‌టాక్‌లో తన పవర్ ప్రెజెంటేషన్‌ని రికార్డ్ చేసి షేర్ చేసింది. “ఈ రోజు నేను మీకు ఒక రహస్యాన్ని వెల్లడిస్తున్నాను. నా జీవితంలో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని..నా కుటుంబంతో నా ఉద్యోగం గురించి చెప్పటానికి యత్నిస్తున్నాను. నన్ను నమ్మే వ్యక్తులుగా..నన్ను ప్రేమంచే వ్యక్తులుగా మీరు నాకు ఉండాలని ఈ విషయాన్ని చెబుతున్నాను’’అంటూ ప్రారంభించింది.

ఈ వీడియోలో లెక్స్ నేను పోల్ డాన్సర్ ని..నేను ఈ పనిచేయటానికి ఏమాత్రం సిగ్గు పడటంలేదు. ఇది చెడ్డపనికాదు. నేను ఈ పనిని ప్రేమిస్తున్నాను. డాన్స్ లో నన్ను నేను నిరూపించుకుంటున్నాను. నేను చాలా సేఫ్టీగా ఉన్నాను మీరేమీ ఆందోళన పడవద్దని తెలిపింది.

లెక్స్ ఆర్థిక పరిస్థితిని ప్రస్తావిస్తూ..ఉద్యోగం చాలా అవసరం. ఈ ఉద్యోగం ద్వారానే చాలా కొనుక్కోగలిగాం..అని ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. పోల్ డాన్స్ ఉద్యోగం చేసేవారు చెడ్డవారని అనుకోవద్దని తన వీడియోలో తెలిపింది. నేను ఎటువంటి లైంగికపరమైన పనులు చేయటంలేదని..చేయబోనని స్పష్టంచేస్తూ..ఆమె తల్లిదండ్రులకు భరోసా ఇచ్చింది.

నన్ను నేను ఎప్పటికీ సేఫ్టీగా ఉంచుకోగలననే నమ్మకం నాకుంది.డ్యాన్సర్‌గా తనను తాను నిరూపించుకోగలిగానని..సురక్షితంగా ఉంటానని లెక్స్ తల్లిదండ్రులకు భరోసా ఇచ్చిందీ వీడియోలో. పోల్ డాన్స్ పేరుతో ఎన్నో ‘చీకటి వ్యాపారాలు’ ఉంటాయని అనుకుంటారని కానీ అటువంటివేమీ లేవని లెక్స్ నొక్కిచెప్పింది.

కాగా..ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రికార్డింగ్ లో లెక్స్ సోదరి కూడా ఉంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు”నా సోదరి ఒక స్ట్రిప్పర్ అని నా తల్లిదండ్రులకు చెప్పడానికి పవర్ పాయింట్ చేసింది” అని ఆమె వీడియోకి క్యాప్షన్ ఇచ్చింది. నైట్ క్లబ్‌లో స్ట్రిప్పర్ అని లెక్స్ తన తల్లిదండ్రులకు చెప్పిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆమె వీడియో చేస్తున్నప్పుడు నేను అక్కడే ఉన్నానని తెలిపింది.