Potassium Iodide : పొటాషియం అయోడైడ్ మాత్రలకు ఎందుకింత డిమాండ్ పెరిగిందంటే? కారణం ఇదే..!
Potassium Iodide : యుక్రెయిన్ రష్యా మధ్య భీకర యుద్ధం రెండు వారాలకు పైగా కొనసాగుతోంది. యుక్రెయిన్ స్వాధీనం చేసుకునేందుకు రష్యా తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

Potassium Iodide Why Potassium Iodide Pills Are Suddenly In High Demand
Potassium Iodide : యుక్రెయిన్ రష్యా మధ్య భీకర యుద్ధం రెండు వారాలకు పైగా కొనసాగుతోంది. యుక్రెయిన్ స్వాధీనం చేసుకునేందుకు రష్యా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయినప్పటికీ యుక్రెయిన్ రష్యాకు లొంగడం లేదు. దాంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ దాడులను మరింత తీవ్రతరం చేస్తున్నారు. యుక్రెయిన్ అణు కర్మాగారాలపై దాడులు చేసేందుకు వెనకాడటం లేదు. రష్యా ప్రమాదవశాత్తు లేదా ఉద్దేశపూర్వకంగా అణుబాంబులతో దాడులు చేసే ప్రమాదం పొంచి ఉంది. ఒకవేళ, అణుబాంబులు ప్రయోగిస్తే అవి సృష్టించే వినాశనం అంతాఇంతా కాదు.. అత్యంత ప్రాణాంతకంగా మారుతుంది. అణు బాంబు ప్రయోగాల్లో రేడియోధార్మిక ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ అణు రేడియోధార్మికత ప్రభావాన్ని తట్టుకుని జీవించడం సాధ్యం కాదు… అణు బాంబులతో దాడులు జరుగుతాయనే భయాందోళనల నేపథ్యంలో ఈ పొటాషియం అయోడైడ్ మాత్రలకు భారీ డిమాండ్ పెరిగిందని చెప్పవచ్చు. అణుబాంబులు ప్రయోగించిన సమయంలో పెద్ద మొత్తంలో రేడియోధార్మిక అయోడిన్ (లేదా రేడియో అయోడిన్) వాతావరణంలోకి విడుదలయ్యే ప్రమాదం ఉంది.. ఇదిగానీ ఊపిరితిత్తులలోకి పీల్చినా లేదా నీరు, నేల, మొక్కలు, జంతువులను కలుషితమైపోతాయని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CDC) వెల్లడించింది.
వాస్తవానికి.. పొటాషియం అయోడైడ్ (potassium iodide) హానికరం కాదు.. కానీ, మానవ శరీరానికి అవసరమైన ముఖ్యమైన రసాయనంగా చెప్పవచ్చు. రేడియోధార్మిక అయోడైడ్ అనేది.. మెడ ముందు భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథికి హాని కలిగిస్తుందని సీడీసీ తెలిపింది. శరీరంలో అనేక హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇంతకీ ప్రమాదం ఏంటంటే?.. ఒకవేళ రేడియేషన్ ఎక్స్ పోజర్ అయితే.. మాత్రం థైరాయిడ్ గ్రంథి సాధారణ అయోడిన్ రేడియోయోడిన్ మధ్య తేడాను గుర్తించలేదు. అప్పుడు ఏదో గుర్తించాలో తెలియక ఆ గ్రంథి రెండింటినీ గ్రహిస్తుంది. ఈ రేడియో అయోడిన్ ఎక్కువ ఎక్స్పోజర్ అయితే థైరాయిడ్ క్యాన్సర్‌కు దారి తీసే ముప్పు ఉంది. సాధారణంగా పోటాషియం అయోడైడ్ ఉపయోగించాల్సి వచ్చినప్పుడు ద్రవరూపం లేదా మాత్రల రూపంలో సూచిస్తుంటారు. ఎందుకంటే ఇది పొటాషియం అయోడైడ్ థైరాయిడ్ గ్రంథిని త్వరగా నింపేస్తుంది. తద్వారా రేడియోధార్మిక అయోడిన్‌ను గ్రహించకుండా నిరోధించవచ్చు. అందుకే ఈ పొటాషియం అయోడైడ్ ధరలు అమాంతం పెరిగిపోవడానికి కారణం ఇదేనని చెప్పవచ్చు.
పెరిగిన హైడిమాండ్.. భారీగా క్షీణించిన అమ్మకాలు :
అమెరికాలో ఈ పొటాషియం అయోడైడ్ అమ్మకాలు భారీగా క్షీణించాయి. ఇటీవలి వారాల్లో రష్యా యుక్రెయిన్‌పై దాడి చేయడంతో పొటాషియం అయోడైడ్ తయారీ నిల్వలు ఒక్కసారిగా క్షీణించాయి. మార్కెట్లో హై డిమాండ్ పెరగడం కారణంగా వీటి కొరత ఏర్పడింది. దాంతో మార్కెట్‌లో పొటాషియం అయోడైడ్ ధరలు ఆకాశాన్నంటాయి. eBay ( EBAY) లో థైరోసేఫ్ పొటాషియం అయోడైడ్ మాత్రల నాలుగు బాక్సులు $132.50గా ఉన్నాయి. మరొకటి IOSAT 130 mg మాత్రల బాక్స్.. ఒక్కొక్కటి $89.95కి అమ్ముడవుతోంది. Anbex తయారు చేసిన IOSAT టాబ్లెట్‌ల 14-ప్యాక్ బాక్స్ తయారీదారు వెబ్‌సైట్‌లో 13.99డాలర్లకు విక్రయిస్తోంది.
పొటాషియం అయోడైడ్ మాత్రలు అన్నింటికీ నివారణ కాదనే విషయాన్ని ముందుగా గుర్తించుకోవాలి. రేడియోధార్మిక అయోడిన్‌కు వ్యతిరేకంగా 100శాతం రక్షణను అందిస్తుందని కచ్చితంగా చెప్పలేమంటున్నారు. ఎందుకంటే.. ఒక్క డోస్ థైరాయిడ్ గ్రంధిని కేవలం 24 గంటల పాటు కాపాడుతుందని CDC హెచ్చరిస్తోంది. చాలామంది ఈ పొటాషియో అయోడైడ్ ద్రావణాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఎక్కువ రక్షణ లభించదనే విషయాన్ని గుర్తించుకోవాలి. సిఫార్సు చేసినదానికంటే ఎక్కువసార్లు ఈ ద్రావణాన్ని తీసుకుంటే తీవ్రమైన అనారోగ్యం లేదా మరణానికి కారణమవుతుందని ఏజెన్సీ హెచ్చరించింది. ఈ పొటాషియం అయోడైడ్ మాత్రలు కేవలం థైరాయిడ్‌ను మాత్రమే రక్షిస్తాయని సీడీసీ చెబుతోంది. కొన్ని వయసుల వారిలో ఈ మాత్రలు అద్భుతంగా పనిచేస్తాయని CDC వెల్లడించింది. న్యూయార్క్‌లోని ప్రముఖ సరఫరాదారు అయిన Anbex, Inc. 65 mg, 130 mg IOSAT పొటాషియం అయోడైడ్ టాబ్లెట్‌లను ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం IOSAT పొటాషియం అయోడైడ్ 130mg 65mg టాబ్లెట్‌ల స్టాక్ లేదని, ఏప్రిల్ ప్రారంభంలో స్టాక్ వస్తుందని భావిస్తున్నామని Anbex సేల్స్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ ట్రాయ్ జోన్స్ (Troy Jones) అన్నారు.
CDC మార్గదర్శకాల ప్రకారమే మాత్రలు వేసుకోవాలి :
పొటాషియం అయోడైడ్ మాత్రలను విక్రయించేందుకు www.nukepills.com అనే వెబ్‌సైట్‌ను కూడా జోన్స్ నిర్వహిస్తున్నారు. రష్యా ఆంక్షల నేపథ్యంలో 15 మిలియన్ల టాబ్లెట్‌ల వరకు ఫిబ్రవరి మధ్య నుంచి ఇప్పటివరకూ భారీ ఆర్డర్లు వచ్చాయని జోన్స్ చెప్పారు. ఫిబ్రవరి 23 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఇదే స్థాయిలో డిమాండ్ నడిచిందన్నారు. రష్యా నుంచి పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో Anbex సరఫరాదారు మోతాదును బట్టి 14-రోజులు లేదా 20-రోజుల ఫాయిల్-సీల్డ్ ప్యాక్‌లో టాబ్లెట్‌లను విక్రయిస్తోంది. అయితే వినియోగదారులు సిడిసి మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, ఆరోగ్య అధికారుల సలహా మేరకు మాత్రమే పొటాషియం అయోడైడ్ మాత్రలు తీసుకోవాలని సూచించారు. లండన్‌కు చెందిన BTG స్పెషాలిటీ ఫార్మాస్యూటికల్స్, ఐరోపా అమెరికా అంతటా పొటాషియం అయోడైడ్ ఉత్పత్తులకు అధిక డిమాండ్ పెరుగుతోంది. BTG Thyrosafe, FDA- ఆమోదించిన 65 mg ఓవర్-ది-కౌంటర్ పొటాషియం అయోడైడ్ టాబ్లెట్‌ను తయారు చేస్తుంది. ఈ కంపెనీ వెబ్‌సైట్‌లో 20 టాబ్లెట్‌ల బాక్స్ ధర $12.95గా ఉందని నివేదిక వెల్లడించింది.
Read Also : Russia-Ukraine War : నాటో దేశాలను టార్గెట్ చేసిన పుతిన్.. అమెరికా లక్ష్యంగా కవ్వింపు చర్యలు!