PM Modi France Tour: ఢిల్లీకి చేరిన ప్రధాని మోదీ.. ట్విటర్‌లో ఆసక్తికర వీడియో షేర్ చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు..

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉదయం ఫ్రాన్స్ నుంచి బయలుదేరి, అబుదాబిలో ఆగిన తరువాత తిరిగి ఢిల్లీ చేరుకున్నారు.

PM Modi France Tour: ఢిల్లీకి చేరిన ప్రధాని మోదీ.. ట్విటర్‌లో ఆసక్తికర వీడియో షేర్ చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు..

PM Narendar Modi

Updated On : July 16, 2023 / 9:14 AM IST

French President : భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendar Modi) ఫ్రాన్స్ (France), యూఏఈ (UAE) దేశాల అధికారిక పర్యటన ముగించుకొని శనివారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్  ( French President Emmanuel Macron) తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ వీడియోను పోస్టు చేశారు. ‘భారత ప్రజలకు నమ్మకం, స్నేహం’ అని మక్రాన్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ వీడియోలో ప్యారిస్‍‌లో ఫ్రెంచ్ నేషనల్ డే వేడుకలకు హాజరైన ప్రధాని మోదీకి ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లెజియన్ ఆఫ్ ఆనర్’ను అందించిన దృశ్యాలు చూడొచ్చు. జూలై 14న ప్రతీయేటా బాస్టిల్ డే, ఫ్రాన్స్ జాతీయ దినోత్సవంలో భారతదేశంలో రిపబ్లిక్ డే మాదిరిగానే పారిస్‌లో ప్రత్యేక కవాతు నిర్వహింబడుతుంది.

PM Modi : ఢిల్లీకి రాగానే ఎల్జీకి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్.. ట్విటర్‌లో అసలు విషయాన్ని చెప్పిన ఎల్జీ సక్సేనా

ఫ్రాన్స్ అధ్యక్షుడు షేర్ చేసిన వీడియోలో.. రెండు దేశాల అధినేతల మధ్య జరిగిన చర్చల దృశ్యాలు ఉన్నాయి. మోనాలిసాతో సహా అనేక ప్రసిద్ధ కళాఖండాలకు నిలయమైన ప్యారిస్ లోని లౌవ్రే మ్యూజియంలో ఏర్పాటు చేసిన విందులో కూడా ప్రధాని మోదీ పాల్గొన్నారు. బాస్టిల్ డే ముగింపు సందర్భంగా వారు బాణ సంచా ప్రదర్శనను తిలకిస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ప్రధాని మోదీతో సెల్ఫీ తీసుకున్న సన్నివేశాన్ని ఈ వీడియోలో చూపించారు. అయితే, ప్రధాని మోదీతో పాటు ఈ సెల్ఫీ‌లో భారతీయ ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ కూడా ఉన్నారు.

PM Modi lands in Delhi : ముగిసిన యూఏఈ, ఫ్రాన్స్ దేశాల పర్యటన…ఢిల్లీకి తిరిగివచ్చిన మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉదయం ఫ్రాన్స్ నుంచి బయలుదేరి, అబుదాబిలో ఆగిన తరువాత తిరిగి ఢిల్లీ చేరుకున్నారు. గల్ఫ్ నగరంలో ప్రధాని మోదీ యూఏఈ అధ్యక్షుడితో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.