పోర్చుగీస్ అధ్యక్షుడి సాహసం..నెటిజన్లు ఫిదా

  • Published By: madhu ,Published On : August 19, 2020 / 10:16 AM IST
పోర్చుగీస్ అధ్యక్షుడి సాహసం..నెటిజన్లు ఫిదా

Updated On : August 19, 2020 / 11:25 AM IST

పోర్చుగీస్ అధ్యక్షుడు మార్సెలో రెబెలో డి సౌజా (71) సరదాగా బీచ్ కు వచ్చారు. కానీ అక్కడున్న సీన్ చూసే సరికి అందరూ షాక్ తిన్నారు. వయస్సు ఏ మాత్రం లెక్క చేయకుండా…డి సౌజా..సముద్రంలో దూకడం ఈదడం అందరూ ఆశ్చర్యపోయారు.



సాహసోపేతంగా..ఇద్దరు అమ్మాయిలను కాపాడిన..డి సౌజను అందరూ ప్రశసించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. హాలీడే ట్రిప్ లో భాగంగా…అల్గావేలోని బీచ్ కు వచ్చారు డి సౌజా. సముద్రపు నీటిలో ఈత కొట్టారు. ఈయనకు కొంచెం దూరంలో ఇద్దరు అమ్మాయిలు ప్రయాణిస్తున్న బోటు మునిగిపోయింది.



వెంటనే డి సౌజా అలర్ట్ అయ్యారు. ఈదుకుంటూ..అక్కడకు చేరుకున్నారు. ఈ సమయానికే మరో వ్యక్తి కూడా బోటుపై వచ్చాడు. వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు.
కానీ..ఇక్కడ విశేషం ఏంటంటే..ఆయన ఓ దేశ అధ్యక్షుడు.



ప్రజల్లో స్వేచ్చగా తిరుగుతుండడం అందర్నీ ఆకట్టుకుంది. ప్రోటోకాల్ పక్కన పెట్టి ఆయన తిరుగుతుంటారని, జనాల కష్టాలు తెలుసుకోవడానికి ఆయన ప్రజల మధ్య తిరుగుతుంటారని అంటుంటారు. మొత్తానికి రెబోలో సాహసానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.