Nick Jonas Falls Off Stage : మ్యూజిక్ కన్సర్ట్‌లో స్టేజ్ పై పడిపోయిన ప్రియాంక చోప్రా భర్త .. వీడియో వైరల్
ప్రియాంక చోప్రా ఆమె భర్త నిక్ జోనాస్ ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. నిక్ జోనాస్ యూఎస్‌లో మ్యూజిక్ కన్సర్ట్స్‌తో బిజీగా ఉన్నారు. ఓ కన్సర్ట్‌లో ఆయన వేదిక పై నుంచి పడిపోతున్న వీడియో వైరల్ అయ్యింది.

Nick Jonas Falls Off Stage
Nick Jonas Falls Off Stage : ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ జంట ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. తరచుగా ప్రియాంక వీరి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. రీసెంట్‌గా ఓ మ్యూజిక్ కన్సర్ట్ లో నిక్ వేదికపై పడిపోయిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ తన సోదరులు కెవిన్, జో జోనాస్‌లతో కచేరీల కోసం యునైటెడ్ స్టేట్స్ అంతా పర్యటనలో ఉన్నారు. జోనాస్ బ్రదర్స్ తమ సంగీతంతో అలరిస్తున్నారు. తాజాగా జరిగిన కార్యక్రమంలో నిక్ వేదికపై పడిపోతున్నట్లు కనిపించిన వీడియో వైరల్ అయ్యింది. ప్రదర్శనలో లీనమై ఉన్ననిక్ అకస్మాత్తుగా వేదిక చివరి అంచుకి వెళ్లి పడిపోవడం కనిపించింది. వెంటనే నిక్ తేరుకుని ప్రదర్శన ప్రారంభించాడు. నిక్ బ్రదర్స్ అతనివైపు ఆందోళనగా చూసారు.. అయితే నిక్ బాగానే ఉన్నాడని వారు అర్ధం చేసుకున్నారు. ఇంటర్నెట్‌లో నిక్ జోనాస్ వీడియో వైరల్ అవుతోంది.
Nick Jonas : పబ్లిక్ ఈవెంట్లో ప్రియాంక చోప్రా భర్తపై లో దుస్తులు విసిరిన ఆడియన్స్..
కొద్ది రోజుల క్రితం, ప్రియాంక చోప్రా నిక్ జోనాస్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అతని పర్యటన గొప్పగా ప్రారంభించినందుకు అభినందించారు. భర్తని మాగ్నెట్ అంటూ ప్రశంసలు కురిపించారు. ‘మీరు అయస్కాంతం.. నేను మిమ్మల్ని కలిగి ఉన్నందుకు చాలా అదృష్టవంతురాలిని. మీ అద్భుతమైన పర్యటన ప్రారంభించినందుకు అభినందనలు’ అంటూ తన పోస్ట్‌లో ప్రేమను కురిపించారు.
CALL TMZ!!!!! NICK FELL!!!!! pic.twitter.com/RY6Drl5dwU
— h 🍒🪩 (@x0heathyyy) August 16, 2023
View this post on Instagram