పేరంట్స్ Ok అనాలంట : PUBG గేమ్‌కు ఏజ్ లిమిట్
పబ్ జీ.. పబ్ జీ.. పరిచయం అక్కర్లేని వీడియో గేమ్. పబ్ జీ మాయలో పడి చేతులారా మానసికంగా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్నీ వయస్సుల వారు ఈ పబ్ జీ గేమ్ కు ఫిధా అయిపోయారు.

పబ్ జీ.. పబ్ జీ.. పరిచయం అక్కర్లేని వీడియో గేమ్. పబ్ జీ మాయలో పడి చేతులారా మానసికంగా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్నీ వయస్సుల వారు ఈ పబ్ జీ గేమ్ కు ఫిధా అయిపోయారు.
పబ్ జీ.. పబ్ జీ.. పరిచయం అక్కర్లేని వీడియో గేమ్. పబ్ జీ మాయలో పడి చేతులారా మానసికంగా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్నీ వయస్సుల వారు ఈ పబ్ జీ గేమ్ కు ఫిధా అయిపోయారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతిఒక్కరి ఫోన్ లో ఈ పబ్ జీ వీడియో గేమ్ కామన్ అయింది. ఆన్ లైన్ గేమ్స్ ఎన్నో ఉన్నప్పటికీ పబ్ జీ గేమ్ మోస్ట్ పాపులర్ వీడియో గేమ్ గా మారిపోయింది.
Also Read : ఫీచర్ డిజేబుల్డ్ : ఆండ్రాయిడ్ టీవీలో బగ్.. యూజర్ల ఫొటోలు లీక్
ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో మిలియన్ల మంది పబ్ జీ గేమ్ ఆటకు బానిసలుగా మారారు. గంటల కొద్ది పబ్ జీ గేమ్ తోనే గడిపేస్తుంటారు. పిల్లల చదువు పాడైపోతుంది. యువత మానసిక స్థితి దెబ్బతింటోందని హెచ్చరిస్తున్నప్పటికీ పబ్ జీ గేమ్ ను వదిలిపెట్టడం లేదు. పబ్ జీ వీడియో గేమ్ ను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ లు వెల్లువెత్తు తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం, గుజరాత్ ప్రభుత్వం తమ రాష్ట్రాల్లో పబ్ జీ వీడియో గేమ్ ను బ్యాన్ చేస్తున్నట్టు ప్రకటించాయి.
పేరంట్స్ Unlock చేస్తేనే..
చైనాకు చెందిన టెన్ సెంట్ ఈ గేమ్ ను 2018 ఫిబ్రవరిలో లాంచ్ చేసింది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా పబ్ జీ వీడియో గేమ్ కు యూత్ బానిసలుగా మారిపోయారు. ఒక్క భారత్ లోనే కాదు.. ఇప్పటికే చైనాలో ఈ గేమ్ పై బ్యాన్ విధించారు. 13 ఏళ్ల వయస్సు కంటే తక్కువ ఉన్న యూజర్లకు ఈ గేమ్ పై నిషేధం విధించింది. పబ్ జీ గేమ్ ఆడాలంటే.. తల్లిదండ్రులతోనే ఓపెన్ చేయించాలి. 13ఏళ్ల లోపు వయస్సు ఉన్న పిల్లలు ఈ గేమ్ ను యాక్సెస్ చేయలేరు.
ఈ తరహా విధానం చైనాలో వచ్చినప్పటికీ త్వరలో గ్లోబల్ గా రానుంది. పబ్ జీ గేమ్ డెవలపర్లు ఈ గేమ్ పై ఏజ్ రిస్ట్రిక్షన్ ఎనేబుల్ చేయనున్నారు. ఏజ్ లిమిట్ ఆధారంగా పబ్ జీ గేమ్ యాక్సస్ చేసుకోవాల్సి ఉంటుంది. పబ్ జీ గేమ్ యూజర్లు ముందుగా తమ వయస్సును ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. 13ఏళ్ల లోపు వయస్సు ఉన్న యూత్.. పబ్ జీ గేమ్ అన్ లాక్ చేయాలంటే.. గార్డియన్స్ అవసరం తప్పనిసరి. 2017లోనే చైనా మైనర్లకు పబ్ జీ గేమ్ లిమిట్ యాక్సస్ గంట సమయం మాత్రమే ఇచ్చింది. ఆ తరువాత ఆటోమెటిక్ గా పబ్ జీ లాక్ అయిపోతుంది.
ఏజ్ లిమిట్.. డిజిటల్ లాక్..
* పబ్ జీ మొబైల్ వర్షన్ వాడే యూజర్లకు ఏజ్ రిస్ట్రిక్షన్స్
* 13ఏళ్ల వయస్సు లోపు ఉంటే పబ్ జీ గేమ్ ఆడలేరు.
* ప్రత్యేకించి చిన్నారులకు డిజిటల్ లాక్ వర్తిస్తుంది.
* 13ఏళ్లు దాటాయా.. మీ ఏజ్ ను ధ్రువీకరించుకోవాలి.
* ఫేస్ రికగ్నైనేషన్ ఐడీ, ప్లేయర్ ఐడీలు ఉండాల్సిందే.
* పిల్లలు పబ్ జీ గేమ్ ఆడాలంటే పేరంట్స్ ఓపెన్ చేసి అన్ లాక్ చేయాలి
Also Read : డోంట్ మిస్ : Airtel 4G మైండ్ బ్లోవింగ్ ఆఫర్స్