Python Swallows Deer :సెకన్లలో జింకను మింగేసిన కొండచిలువ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

జింకను కొండచిలువ మింగేసింది. కొన్ని సెకన్లలోనే జింక మొత్తాన్ని మింగేసింది. జింకను కొండచిలువ మింగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో క్లిప్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్స్ ను షాక్‌కు గురి చేసింది.

Python Swallows Deer

Python Swallows Deer : జింకను కొండచిలువ మింగేసింది. కొన్ని సెకన్లలోనే జింక మొత్తాన్ని మింగేసింది. జింకను కొండచిలువ మింగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో క్లిప్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్స్ ను షాక్‌కు గురి చేసింది. వీడియోను షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్న విషయాన్ని మాత్రం పేర్కొనలేదు. ఇది బర్మీస్ పైథాన్ అని, గ్రహం మీద అతిపెద్ద పాములలో ఇది ఒకటని చాలా మంది ఇన్ స్టాగ్రామ్ యూజర్స్ తెలిపారు. ఈ వీడియో రివర్స్‌లో ఉందని కూడా సూచించారు. కొండచిలువలు అంత వేగంగా తినవని తెలిపారు.

beautiful new pix ద్వారా ఇన్‌స్టాగ్రామ్ క్లిప్ షేర్ చేశారు. జింకను మింగుతున్న కొండచిలువ శరీరాన్ని ఒక వ్యక్తి తట్టినట్లు వీడియో క్లిప్ లో కనిపిస్తోంది. ఈ వీడియోపై ఇన్‌స్టాగ్రామ్ యూజర్స్ కామెంట్ల వర్షం కురిపించారు. “నేను నిజంగా పాములను ద్వేషిస్తాను” అని ఒక ఇన్ స్టాగ్రామ్ యూజర్ వ్యాఖ్యానించారు. వారం క్రితం అప్‌లోడ్ చేసిన ఈ వీడియోకు 27,752 లైక్‌లు రాగా, వందలు, వేల మంది చేశారు.

Python : ఇంట్లోకి ప్రవేశించి రెండు కోళ్లను మింగిన కొండ చిలువ

బర్మీస్ కొండచిలువలు జంతువు చుట్టూ చుట్టి ఊపిరాడకుండా చేస్తాయి. అనంతరం వాటిని మింగి చంపుతాయి. ఈ భారీ పాములు వాటి దవడలలో సాగే స్నాయువులను కలిగి ఉంటాయి. అవి వాటి ఆహారాన్ని పూర్తిగా మింగడానికి ఉపయోగడపతాయి. నేషనల్ జియోగ్రాఫిక్ ప్రకారం బర్మీస్ కొండచిలువలు మాంసాహారులు. ఇవి ఎక్కువగా చిన్న క్షీరదాలు, పక్షులను తింటాయి. కానీ వాటిలో కొన్ని పందులు లేదా మేకల వంటి పెద్ద ఆహార పదార్థాలను వేటాడినట్లు గుర్తించారు. ఎలిగేటర్‌లపై దాడి చేసి తింటాయని తెలిసింది.