Cuban Communist Party : ముగిసిన క్యాస్ట్రో శకం

క్యూబా రాజకీయాలను ఆరు దశాబ్దాలుగా శాసిస్తున్న క్యాస్ట్రో శకం ముగియనుంది. క్యూబన్‌ కమ్యూనిస్టు పార్టీ ప్రథమ కార్యదర్శి పదవి నుంచి వైదొలుగుతున్నట్లు రౌల్‌ క్యాస్ట్రో ప్రకటించారు.

Raul Castro : క్యూబా రాజకీయాలను ఆరు దశాబ్దాలుగా శాసిస్తున్న క్యాస్ట్రో శకం ముగియనుంది. క్యూబన్‌ కమ్యూనిస్టు పార్టీ ప్రథమ కార్యదర్శి పదవి నుంచి వైదొలుగుతున్నట్లు రౌల్‌ క్యాస్ట్రో ప్రకటించారు. ఆ పార్టీ 8వ సదస్సు ప్రారంభ ఉన్యాసంలో తాను పదవి నుంచి వైదొలగుతున్నట్లు రౌల్‌ క్యాస్ట్రో వెల్లడించారు. దీంతో క్యూబా రాజకీయాల్లో క్యాస్ట్రో శకం ముగిసిపోనుంది.

ఇన్నేళ్లపాటు నిర్వహించిన విధుల గురించి రౌల్‌ క్యాస్ట్రో సంతృప్తి వ్యక్తం చేశారు. క్యూబా భవిష్యత్తు బాగుంటుందని తాను విశ్వసిస్తున్నాన్నారు. దేశాభివృద్ధిలో యువతరం కీలక పాత్ర పోషిస్తుందని.. తన తరువాత పార్టీ బాధ్యతలను యువతరానికి అప్పగించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కానీ తన వారసుడు ఎవరనేది మాత్రం ఆయన ప్రకటించలేదు.

2016 లో రౌల్‌ సోదరుడు ఫిడెల్‌ క్యాస్ట్రో చనిపోయిన తరువాత రౌల్‌ క్యాస్ట్రో కమ్యూనిస్టు పార్టీ బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఐదేళ్లపాటు ఆయన తన బాధ్యతలు నిర్వర్తించారు. కాగా ప్రస్తుత క్యూబా అధ్యక్షుడు మిగుయేల్‌ డియాజ్‌ కానెల్‌ తదుపరి ప్రథమ కార్యదర్శిగా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. క్యూబాకు అధ్యక్షుడు ఉన్నప్పటికీ.. రాజకీయంగా క్యూబన్‌ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిదే అక్కడ ఆధిపత్యం ఉంటుంది.

Read More : Hyderabad : పిల్లలకు వాహనాలు ఇస్తున్నారా ? బీ కేర్ ఫుల్ పేరెంట్స్

ట్రెండింగ్ వార్తలు