Hyderabad : పిల్లలకు వాహనాలు ఇస్తున్నారా ? బీ కేర్ ఫుల్ పేరెంట్స్

బండి అంత ఎత్తు లేకున్నా.. రోడ్డుపైకి రయ్యిమంటూ దూసుకొస్తారు. వచ్చీరాని డ్రైవింగ్‌తో హైవేలు ఎక్కేసి హల్‌చల్‌ చేస్తారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకున్నా.. బండిని కంట్రోల్‌ చేయడం తెలియకున్నా.. జామ్‌ అంటూ వచ్చి యాక్సిడెంట్స్‌ చేసేస్తారు.

Hyderabad : పిల్లలకు వాహనాలు ఇస్తున్నారా ? బీ కేర్ ఫుల్ పేరెంట్స్

Be Careful Parents

Be Careful Parents : బండి అంత ఎత్తు లేకున్నా.. రోడ్డుపైకి రయ్యిమంటూ దూసుకొస్తారు. వచ్చీరాని డ్రైవింగ్‌తో హైవేలు ఎక్కేసి హల్‌చల్‌ చేస్తారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకున్నా.. బండిని కంట్రోల్‌ చేయడం తెలియకున్నా.. జామ్‌ అంటూ వచ్చి యాక్సిడెంట్స్‌ చేసేస్తారు. ఇలా మైనర్ల నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు ఎంతో మంది బలి అవుతున్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు హైదరాబాద్‌ పోలీసులు నడుం బిగించారు. స్పెషల్‌ డ్రైవ్‌లతో డ్రైవింగ్‌ చేసే మైనర్లనే కాదు.. ఏ మాత్రం బాధ్యత లేకుండా వారికి వాహనాలు ఇస్తోన్న తల్లిదండ్రులపైనా కేసులు పెడుతున్నారు.

హైద‌రాబాద్ న‌గ‌రంలో మైన‌ర్ల డ్రైవింగ్ పరిపాటిగా మారింది. ఆ సరదా డ్రైవింగ్ కాస్తా అత్యంత ప్రమాదకరంగా మారింది. పిల్లల స‌ర‌దా కోసం అత్యంత ఖ‌రీదైన వాహ‌నాలు ఇచ్చి ప‌రోక్షంగా ప్రమాదాల‌కు కార‌కుల‌వుతున్నారు త‌ల్లిదండ్రులు. మైన‌ర్ పిల్లల ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, సిగ్నల్ జంప్‌లతో ఇత‌రుల‌కు అటంకంగా మార‌డ‌మే కాకుండా ఎంతో మంది మృతికి కార‌ణం అవుతున్నారు. దీంతో పోలీసులు ఈ వ్యవ‌హారాన్ని సీరియ‌స్‌గా తీసుకున్నారు. మైన‌ర్లు డ్రైవింగ్ చేస్తూ ప‌ట్టుబ‌డితే వారిని జువైన‌ల్ కోర్టులో హాజ‌రుప‌రుస్తున్నారు. ఇటు త‌ల్లిదండ్రుల‌ను కూడా కోర్టులో ప్రవేశ పెడుతున్నారు.

ఇటీవలే మైనర్ డ్రైవింగ్ పై దృష్టి పెట్టిన పోలీసులు గడిచిన రెండేళ్లలో 7వేల కేసులు నమోదు చేశారు. పిల్లల‌కు వాహ‌నాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నందుకు అటు త‌ల్లిదండ్రులపై కూడా చ‌ర్యలు తీసుకుంటున్నారు. న‌గ‌రంలోని పాతబస్తీ, న్యూ సిటీల్లో ట్రిపుల్‌ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, నో వేర్ హెల్మెట్, సిగ్నల్ జంప్ ఇలా మైన‌ర్ పిల్లలు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదానికే కాకుండా పలువురి మృతికి కార‌ణ‌మ‌య్యారు. ఇటీవల కాలంలో మైనర్ల ర్యాష్ డ్రైవింగ్ వల్ల కొందరు రోడ్డు ప్రమాదాలకు గురయ్యారు. పదుల సంఖ్యలో మృత్యువాతపడ్డారు. దీంతో దీన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టక తప్పలేదు.

అయితే గతంలో పిల్లలపై చర్యలు తీసుకున్నా.. పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో ఈసారి తల్లిదండ్రులను కూడా ఇన్‌వాల్వ్‌ చేశారు పోలీసులు. పిల్లలకు వాహనాలు ఇస్తున్న పేరెంట్స్‌పైనా చర్యలు తీసుకుంటున్నారు. వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. కోర్టులో హాజరుపరిచి చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు. సో.. పేరెంట్స్‌ మీ పిల్లలు బండి నడుపుతున్నారని.. సంబరపడిపోకండి, పోలీసులకు చిక్కితే మీరు కోర్టు మెట్లు ఎక్కాల్సిందే. జడ్జి చేత చివాట్లు తినాల్సిందే. జరిమానాలు కట్టాల్సిందే. బీ కేర్‌ ఫుల్‌ పేరెంట్స్‌.

Read More : కరోనా బారిన తారలు.. ఆగుతున్న షూటింగ్‌లు