WEF: ఛీ ఛీ.. దావోస్‌లో ఓ పక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్.. మరోపక్క చీకటి బాగోతాలు.. ఏం జరిగిందో తెలుసా?

డబ్ల్యూఈఎఫ్‌కు హాజరైన వారిలో చాలా మంది ఇందులో బుకింగ్స్‌ చేసుకున్నారు.

WEF: ఛీ ఛీ.. దావోస్‌లో ఓ పక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్.. మరోపక్క చీకటి బాగోతాలు.. ఏం జరిగిందో తెలుసా?

Updated On : January 26, 2025 / 8:49 PM IST

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఈ నెల 20 నుంచి 24 వరకు జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సు-2025కు ప్రపంచ దేశాల నుంచి మహామహులు హాజరయ్యారు. ఇందులో పెట్టుబడులతో పాటు వాతావరణ మార్పులు, నాల్గో పారిశ్రామిక విప్లవం, ప్రపంచ భద్రత వంటి అనేక సమస్యలపై చర్చలు జరిగాయి.

అయితే, ఇదే సమయంలో స్విస్ ఆల్ప్స్‌లో సెక్స్‌ పార్టీలు జోరుగా జరిగాయని బ్రిటిష్‌ మీడియా డైలీమెయిల్‌ తెలిపింది. లైంగికపర సర్వీసులను అందించే ఎస్కార్ట్‌ ఏజెన్సీలకు డిమాండ్ విపరీతంగా పెరిగిందని చెప్పింది.

సెక్స్‌ పార్టీలు, రహస్యంగా ఒప్పందాలు చేసుకుని వేశ్యలు, లింగమార్పిడి మహిళల వద్దకు వెళ్లిన వారి సంఖ్య బాగా పెరిగిందని పేర్కొంది. డబ్ల్యూఈఎఫ్‌కు దాదాపు 3,000 మంది వ్యాపార, పరిశ్రమ నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ రంగ పెద్దలు హాజరయ్యారు.

వ్యాపార, రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు వంటి పలు రంగాల వారు ఎందరో సదస్సుకు వెళ్లారు. వారిని దృష్టిలో ఉంచుకుని ఓ వెబ్‌సైట్‌ “డేట్‌ యు పే ఫర్” పేరిట ఈ చీకటి కార్యకలాపాలను నిర్వహించింది. డబ్ల్యూఈఎఫ్‌కు హాజరైన వారిలో చాలా మంది ఇందులో బుకింగ్స్‌ చేసుకున్నారు.

ఒకేసారి చాలా మంది అమ్మాయిలను బుక్‌ చేసుకుని ఎంజాయ్‌ చేశారని డైలీమెయిల్‌ చెప్పింది. 300 మంది అమ్మాయిలను కేవలం 90 మంది కస్టమర్లు బుక్‌ చేసుకున్నారని తెలిపారు. టిట్‌4టాట్‌ ప్రతినిధి ఆండ్రియాస్ బెర్గర్ దీనిపై మాట్లాడుతూ.. డబ్ల్యూఈఎఫ్‌కు ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు మొత్తం 300 మంది అమ్మాయిలు, ట్రాన్స్‌ విమెన్‌ను దావోస్‌, దాని సమీప ప్రాంతాల్లో బుక్‌ చేసుకున్నారని వివరించారు.

గత ఏడాదితో 170 మందిని బుక్ చేసుకుంటే ఈ సారి ఈ సంఖ్య బాగా పెరిగిందని చెప్పారు. బుకింగ్స్‌లో తమకు ఇదో రికార్డని తెలిపారు. గత ఏడాది కంటే ఈ ఏడాది సెక్స్‌ పార్టీలు మరింత పెరిగాయని చెప్పారు. చాలా మంది నుంచి అసహజ శృంగారం కోసం డిమాండ్లు వచ్చాయని తెలిపారు.

Stroke Risk : బాబోయ్.. తల్లిదండ్రులు విడిపోయిన పిల్లల్లో ఈ భయంకరమైన జబ్బు వచ్చే ప్రమాదం ఉందట..!