Stroke Risk : బాబోయ్.. తల్లిదండ్రులు విడిపోయిన పిల్లల్లో ఈ భయంకరమైన జబ్బు వచ్చే ప్రమాదం ఉందట..!

తల్లిదండ్రులు చేసే తప్పు వారి పిల్లలకు శాపంగా మారుతోందా? చేయని తప్పునకు వారు బలైపోతున్నారా? అసలు వారికి పొంచి ఉన్న ముప్పు ఏంటో తెలిస్తే షాక్ కి గురవ్వాల్సిందే..

Stroke Risk : బాబోయ్.. తల్లిదండ్రులు విడిపోయిన పిల్లల్లో ఈ భయంకరమైన జబ్బు వచ్చే ప్రమాదం ఉందట..!

Updated On : January 26, 2025 / 7:05 PM IST

Stroke Risk : ఈ మధ్య కాలంలో డివోర్స్ కేసులు బాగా పెరిగిపోయాయి. చాలా జంటలు విడాకులు తీసుకుంటున్నాయి. దీనికి వారు అనేక కారణాలు చెబుతున్నారు. విడాకులు తీసుకుని విడిపోయే జంటలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. అయితే, వారి పిల్లలే ఇప్పుడు ప్రమాదంలో పడుతున్నారు. తల్లిదండ్రులు విడిపోయిన పిల్లల ఆరోగ్యానికి సంబంధించి ఓ అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి.

వారు పెద్దయ్యాక గుండె జబ్బులు వచ్చే ప్రమాదం..!
తల్లిదండ్రులు విడిపోయిన పిల్లలకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు తప్పవా? వారికి హెల్త్ రిస్క్ లో పడినట్లేనా? వారు పెద్దయ్యాక గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందా? అంటే అవుననే అంటోంది ఓ అధ్యయనం. కెనడాకు చెందిన పరిశోధకులు జరిపిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. తల్లిదండ్రులు విడిపోయిన పిల్లలకు పెద్దయ్యాక గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని వారి రీసెర్చ్ లో తేలింది.

Also Read : చలికాలంలో రాత్రిపూట కొద్దిగా రమ్ పుచ్చుకుంటే.. తెల్లారేసరికి దగ్గు తగ్గిపోతుందట.. ఇందులో నిజమెంత? సైన్స్ ఏం చెబుతుందంటే?

డిప్రెషన్, డయాబెటిస్ వంటి ఆరోగ్య సమస్యలు..
65 ఏళ్లు దాటిన 13వేల మందిపై సర్వే నిర్వహించామని అధ్యయనకర్తలు తెలిపారు. 18ఏళ్లు వచ్చేలోపు తల్లిదండ్రులు విడిపోవడాన్ని చూసిన వారిలో 60శాతం మందికి గుండెపోటు వచ్చిందని వెల్లడించారు. ఇంకా వారు డిప్రెషన్, డయాబెటిస్ వంటి వాటితో బాధపడుతున్నట్లు గుర్తించామన్నారు. ఇవన్నీ కలిగలిపే గుండెపోటుకు దారి తీస్తున్నాయని అధ్యయనకర్తలు తమ నివేదికలో వివరించారు. టోరంటో యూనివర్సిటీ, టిండేల్ యూనివర్సిటీ, టెక్సాస్ యూనివర్సిటీ అధ్యయనకర్తలు ఈ అధ్యయనం చేశారు.

Also Read : ఇదేందిది కొత్తగా ఇంకొకటి.. పిల్లలు, యువతలో సడన్‌గా నరాల జబ్బు.. లక్షణాలు ఇవే.. చెక్ చేసుకోండి!

మానసిక కుంగుబాటు, అధిక ఒత్తిడి..
తల్లిదండ్రులు విడిపోవడాన్ని కళ్లారా చూసిన పిల్లలు మానసికంగా కుంగిపోతారని, వారిపై అధిక ఒత్తిడి ఉంటుందని అధ్యయనకర్తలు తెలిపారు. వారు పెరిగి పెద్దయ్యాక ఇది గుండెపోటుకు దారితీసే ప్రమాదం ఎక్కువగా ఉందన్నారు. 2022 బిహేవియరల్ రిస్క్ ఫ్యాక్టర్ సర్వైలెన్స్ సర్వే ఆధారంగా ఈ స్టడీ రూపొందించబడిందన్నారు.