Winter Cough : చలికాలంలో రాత్రిపూట కొద్దిగా రమ్ పుచ్చుకుంటే.. తెల్లారేసరికి దగ్గు తగ్గిపోతుందట.. ఇందులో నిజమెంత? సైన్స్ ఏం చెబుతుందంటే?

Winter Cough : శీతాకాలంలో దగ్గు వేధిస్తోందా? వేడి నీటితో లేదా రమ్ లేదా బ్రాందీ సేవించడం ద్వారా చలికాలంలో దగ్గు వెంటనే నయం అవుతుందని చాలామంది నమ్ముతారు. కానీ, ఈ విషయంలో వైద్యులు ఏం చెబుతున్నారంటే?

Winter Cough : చలికాలంలో రాత్రిపూట కొద్దిగా రమ్ పుచ్చుకుంటే.. తెల్లారేసరికి దగ్గు తగ్గిపోతుందట.. ఇందులో నిజమెంత? సైన్స్ ఏం చెబుతుందంటే?

Can two spoons of rum at night

Updated On : January 25, 2025 / 11:06 PM IST

Winter Cough For Health : అసలే చలికాలం చంపేస్తోంది. చలికాలం వచ్చిందంటే చాలు.. జలుబు, దగ్గు వేధిస్తుంటాయి. ఒక్కసారి వచ్చాయంటే తొందరగా వదలవు. అనేక మంది దగ్గు, జలుబు నుంచి తొందరగా ఉపశమనం పొందడానికి అనేక హోం రెమిడీలను ప్రయత్నిస్తుంటారు. అప్పటికీ తగ్గకపోతే డాక్టర్ దగ్గరకు వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకుంటారు. అదే శీతాకాలంలో రాత్రిపూట బ్రాందీ లేదా రమ్‌ రెండు చెంచాలు పుచ్చుకుంటే చాలంట.. తెల్లారేసరికి దగ్గు దానంతట అదే తగ్గిపోతుందని అంటున్నారు.

Read Also : Mental Health Study : మానసిక ఆరోగ్యంపై అధ్యయనం.. భారత్‌లో పురుషుల్లో కన్నా మహిళల్లోనే తీవ్ర ఒత్తిడి..!

వాస్తవానికి.. చలికాలంలో మద్యం సేవించడం వల్ల ఆరోగ్య సమస్యల నుంచి తొందరగా బయటపడొచ్చునని నమ్ముతారు. అయితే, దీనికి ఎలాంటి శాస్త్రీయ ప్రాతిపదిక లేదనే చెప్పాలి. ఇందులో నిజమెంత? ఈ విషయంలో వైద్యులు అసలు ఏం చెబుతున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

“ఈ శీతాకాలంలో మా నాన్న రమ్ బాటిల్ ఇంటికి తెచ్చినప్పుడు.. ఆయన తాగడు కాబట్టి నేను కొంచెం ఆశ్చర్యపోయాను. నేను అదే అతనిని అడిగినప్పుడు, తనకు దగ్గు నయం అయ్యేందుకు అని చెప్పాడు, ”అని ఢిల్లీకి చెందిన 27 ఏళ్ల వ్యాపారవేత్త వాన్ష్ చెప్పుకొచ్చాడు. ఈ సంఘటన నన్ను నా చిన్ననాటికి రోజులకు తీసుకువెళ్ళింది. ఎందుకంటే.. నాకు దగ్గు లేదా జలుబు వచ్చినప్పుడల్లా మా నాన్న నాకు రాత్రిపూట మంచుకొరికే చలికాలంలో ఒక టీస్పూన్ బ్రాందీ ఇచ్చేవారు” అని చెప్పుకొచ్చాడు.

చలికాలంలో కొంచెం రమ్ లేదా బ్రాందీ దగ్గును నయం చేయగలదని వంశ్ తండ్రి మాత్రమే నమ్మలేదు. నిజానికి, పాశ్చాత్య దేశాలలో ఇదో హోం రెమిడీగా భావిస్తారు.’ దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే ‘ మూవీలో వణుకుతున్న కాజోల్‌కి షారూఖ్ ఖాన్ కాగ్నాక్ (ఒక రకమైన బ్రాండ్) ఆఫర్ చేయడం గుర్తుందా ? అలాగే ‘ చాందినీ’లో శ్రీదేవికి రిషి కపూర్‌ అందించారు. దగ్గు తగ్గాలంటే రమ్ సేవించడం అనేది అత్యంత సాధారణ మార్గం.. హాట్ టాడీ (కాక్టెయిల్) తయారు చేయడంగా చెప్పవచ్చు. దాల్చినచెక్క, లవంగాలు, స్టార్ సోంపు వంటి సుగంధ ద్రవ్యాలతో నీటిని మరిగించి, కొంచెం రమ్ (30 మి.లీ) వేసి, నెమ్మదిగా సిప్ చేయండి.

వైద్యులు ఏమి చెబుతున్నారంటే? :
రమ్ లేదా బ్రాందీ తాగడం వల్ల గొంతు నొప్పికి ఉపశమనం కలుగుతుందని, జలుబు వల్ల వచ్చే ముక్కకారడం సమస్యను క్లియర్ చేస్తుందని నమ్ముతారు. వైద్యులు ఏ విధమైన ఆల్కహాల్‌ను చికిత్సగా తీసుకోవాలని సిఫారసు చేయరు. వేడి నీళ్లతో రమ్ తాగడం వల్ల రోగలక్షణ ఉపశమనం మాత్రమే లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

మద్యం వినియోగంతో ఎదురయ్యే ప్రయోజనాల కన్నా ఎక్కువగా ఉంటాయి. ఇది మీకు కొంచెం వెచ్చదనాన్ని ఇస్తుంది. రోగలక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. జలుబు, దగ్గు వంటి వైరల్ ఇన్ఫెక్షన్ల చికిత్సకు ఉపయోగించదు. రెగ్యులర్‌గా రమ్‌ని ఉపయోగించడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది” న్యూఢిల్లీలోని సర్ గంగా రామ్ హాస్పిటల్ మెడిసిన్ చైర్‌పర్సన్ డాక్టర్ అతుల్ కకర్ పేర్కొన్నారు.

ఆరోగ్యంపై ప్రభావం ఎంతంటే? :
తక్కువ పరిమాణంలో ఆల్కహాల్ తీసుకోవడం ఎంతో ముఖ్యం. “రమ్‌తో సహా ఆల్కహాల్ కాలేయంపై గణనీయమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే కొవ్వు కాలేయ వ్యాధి వంటి కాలేయ సమస్యలు ఉన్నవారిలో తక్కువ మద్యం వినియోగం కూడా వాపుకు దారితీస్తుంది. అదేపనిగా సేవించడం వల్ల కాలక్రమేణా కాలేయం దెబ్బతింటుంది ”సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రో డాక్టర్ సాద్ అన్వర్ తెలిపారు. ఆల్కహాల్ రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుంది. రక్షణ ప్రయోజనాలను అందించడం కన్నా అంటువ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.

Read Also : Mental Health Study : మానసిక ఆరోగ్యంపై అధ్యయనం.. భారత్‌లో పురుషుల్లో కన్నా మహిళల్లోనే తీవ్ర ఒత్తిడి..!

మద్యం బదులుగా ఏం తీసుకోవాలంటే? :
హెర్బల్ టీ తాగడం వల్ల ఇదే ఉపశమనాన్ని కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు. పరిశోధనలు కూడా ఇదే సూచిస్తున్నాయి. 2008లో నిర్వహించిన అధ్యయనంలో పాల్గొనేవారు వేడి పానీయం తీసుకోవడం ద్వారా దగ్గు, ముక్కు కారడం, తుమ్ముల లక్షణాల నుంచి తక్షణ ఉపశమనం పొందారని నివేదించారు. “శీతాకాలపు వ్యాధులకు ‘పరిష్కారం’గా ఆల్కహాల్‌పై ఆధారపడటం మాత్రమే కాదు.. వ్యసనం, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కూడా దారితీయవచ్చు.

దానికి బదులుగా నిరూపితమైన నివారణలకు ప్రాధాన్యత ఇవ్వండి. దగ్గు లక్షణాలను నివారించేందుకు వైద్య నిపుణుల సూచనలను పొందండి, ”అని డాక్టర్ అన్వర్ సూచిస్తున్నారు. మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్‌గా ఉంచుకోండి. సరైన విశ్రాంతి తీసుకోండి. వేడి నీటిని తాగండి. చలికాలంలో జలుబు లేదా దగ్గుతో బాధపడుతున్నప్పుడు ఆవిరి పీల్చడానికి ప్రయత్నించండి. ఎందుకంటే రమ్ లేదా బ్రాందీ తాగడం కన్నా చాలా ప్రభావవంతంగా ఉంటాయని వైద్యులు అంటున్నారు.