Afghanistan రిపోర్టర్ ‌‌పై దాడి చేసిన తాలిబన్లు

అప్ఘానిస్తాన్ లోని ప్రముఖ న్యూస్ ఛానల్ "టోలో న్యూస్" రిపోర్టర్ జియార్ యాద్ ఖాన్ పై తాలిబన్లు దాడి చేశారు.

Afghan Reporter

Afghan Reporter  అప్ఘానిస్తాన్ లోని ప్రముఖ న్యూస్ ఛానల్ “టోలో న్యూస్” రిపోర్టర్ జియార్ యాద్ ఖాన్ పై తాలిబన్లు దాడి చేశారు. దేశంలో ఉన్న పేద‌రికం, నిరుద్యోగ అంశాల‌పై జియార్ యాద్ ఖాన్ కాబూల్ సిటీ నుంచి రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో తాలిబన్లు ఆయనపై దాడికి పాల్పడ్డారు. అయితే తొలుత తాలిబ‌న్ల దాడిలో జ‌ర్న‌లిస్టు జియార్ చ‌నిపోయిన‌ట్లు వార్త‌లు రాగా…ఆ వార్తలు ఫేక్ అంటూ స్వయంగా జర్నలిస్ట్ జియార్ ఓ ట్వీట్ చేశారు.

జర్నలిస్ట్ జియార్ చేసిన ట్వీట్ లో.. కాబూల్ లో రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో తాలిబన్లు నన్ను కొట్టారు. తాలిబన్లు ఆయుధాలు కలిగి ఉన్న ల్యాండ్ క్రూయిజర్ నుండి బయటకు దిగి తనను తుపాకీతో కొట్టారు. కెమెరాలు, సాంకేతిక పరికరాలు మరియు నా వ్యక్తిగత మొబైల్ ఫోన్ కూడా లాక్కున్నారు. కొంతమంది నేను చనిపోయానని తాను చనిపోయినట్లు తప్పుడు ప్రచారం చేశారని జియార్ తెలిపారు.

కాగా,గత నెలలో అఫ్ఘానిస్తాన్ లో తాలిబన్లకు, అక్కడి భద్రతా దళాలకు మధ్య జరుగుతున్న భీకర పోరును చిత్రీకరించేందుకు వెళ్లిన ప్రముఖ భారతీయ జర్నలిస్టు, పులిట్జర్ అవార్డు గ్రహీత డానిష్ సిద్ధిఖీ మరణించిన విషయం తెలిసిందే. 40 ఏళ్ల డానిష్ సిద్ధిఖీ.. ఆఫ్ఘానిస్తాన్ స్పెష‌ల్ ఫోర్సెస్ వెంట ఉంటూ అక్క‌డి ప‌రిస్థితిపై రిపోర్ట్ చేస్తున్న సమయంలో తాలిబన్లు ఫైరింగ్ జరపడంతో ప్రాణాలు కోల్పోయాడు డానిష్ సిద్ధిఖీ.