Rishi Sunak : వారంలో 36 గంటలు ఉపవాసం.. ఆసక్తి రేపుతున్న రిషి సునక్ ఆహార నియమాలు

యూకే ప్రధాని రిషి సునక్ 36 గంటల పాటు ఉపవాసం వైరల్ అవుతోంది. వారంలో 36 గంటలు ఉపవాసం ఉంటే మరి ఆ సమయంలో ఆయన ఏం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

Rishi Sunak : వారంలో 36 గంటలు ఉపవాసం.. ఆసక్తి రేపుతున్న రిషి సునక్ ఆహార నియమాలు

Rishi Sunak

Updated On : February 1, 2024 / 12:26 PM IST

Rishi Sunak : యూకే ప్రధాని రిషి సునక్ ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి మంగళవారం ఉదయం 5 గంటల వరకు ఉపవాసంలో ఉంటారట. మరి ఆ సమయంలో ఏం తీసుకుంటారు? చాలామందిలో ఆసక్తి రేపుతున్న ‘మాంక్ ఫాస్ట్’ వల్ల ఉపయోగాలు ఏంటి?

Sudha Murty : ప్రజల నుండి నెగెటివిటీ ఎదుర్కోవడంలో.. రిషి సునక్, అక్షతలకు సుధామూర్తి ఇచ్చే సలహా ఏంటంటే?

దేవుడిపై భక్తితో కావచ్చు.. ఆరోగ్యం కోసం కావచ్చు చాలామంది ఉపవాసం ఉంటారు. పర్వదినాల్లో కూడా చాలామంది ఉపవాసాలు ఉంటారు. సాధారణ వ్యక్తులు సరే.. ఒక దేశానికి ప్రధానమంత్రి అయి ఉండి నిత్యం ఎన్నో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉపవాసం ఉండటం అంటే చాలా కష్టం. కానీ యూకే ప్రధాని రిషి సునక్ వారంలో 36 గంటల పాటు ఉపవాసం ఉంటూ కూడా పరిపాలన అంశాల్లో చురుగ్గా పాల్గొంటారు. మరి ఆ సమయంలో 36 గంటలపాటు ఉపవాసం ఉంటే ఆయన ఎటువంటి ఆహారం తీసుకుంటారు? ఆయన ఆహార నియమాలు ఏంటి? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

రిషి సునక్ వారంలో 36 గంటల పాటు ఆహారం తీసుకోరట. ఆదివారం సాయంత్రం  5గంటల నుండి మంగళవారం ఉదయం 5 గంటల వరకు ఉపవాసంలో ఉంటారట. ఉపవాస సమయంలో కేవలం నీరు, టీ లేదా బ్లాక్ కాఫీ మాత్రమే తీసుకుంటారట. సోమవారం అయితే పూర్తిగా ఆహారానికి దూరంగా ఉంటారట. అయినప్పటికీ ఆయన అధికారిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారని సన్నిహితులు చెబుతున్నారు. అయితే రిషి సునక్ పాటించే ఈ ఆహార నియమాన్ని ‘మాంక్ ఫాస్ట్’ అంటారు. ఈ ఫాస్టింగ్ వల్ల ఏకాగ్రత, క్రమశిక్షణ అలవడుతుందని బ్రిటన్ మీడియా సైతం వెల్లడించింది. రిషి సునక్‌కి ఫుడ్ అంటే చాలా ఇష్టమట.. ముఖ్యంగా తీయని పదార్ధాలంటే ఎంతో ఇష్టపడే ఆయన పదవీ బాధ్యతల దృష్ట్యా వ్యాయామం చేయడానికి సమయం కేటాయించలేక ఈ మాంక్ ఫాస్ట్ మొదలుపెట్టారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

Rishi Sunak : హిందువుగా ఉన్నందుకు గర్విస్తున్నా.. రిషి సునక్ వ్యాఖ్యలు వైరల్

డైటీషియన్ల ప్రకారం మాంక్ ఫాస్ట్ వల్ల శరీరంలో కొవ్వు తగ్గుతుందట. కండరాలకు శక్తితో పాటు మృత కణాలు బయటకు వెళ్లి ఆరోగ్యకరమైన కణాల పునరుత్పత్తి జరుగుతుందట. హార్మోన్ల నియంత్రణపై సానుకూల ప్రభావం చూపించడంతో పాటు మెదడు శక్తి పెరుగుతుందట. చక్కెర స్ధాయిలపై కూడా సానుకూల ప్రభావం చూపిస్తుందట ఈ మాంక్ ఫాస్ట్.