కొత్త పోప్ గా రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రెవోస్ట్.. పోప్ లియో 14గా పేరు మార్పు.. ఎవరీ కొత్త పోప్?

కొత్త పోప్ గా రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రెవోస్ట్.. పోప్ లియో 14గా పేరు మార్పు.. ఎవరీ కొత్త పోప్?

Leo XIV is New Pope (Image:@AGisotti/X)

Updated On : May 9, 2025 / 3:19 AM IST

క్యాథలిక్ చర్చి 267వ పోప్ గా రాబర్ట్ ఫ్రాన్సి్ ప్రెవోస్ట్ ఎంపికయ్యారు. కొత్తగా పోప్ గా ఎన్నికైన అనంతరం ఆయన పేరు మారింది. పోప్ లియ్ 14 అనే పేరును పెట్టుకున్నారు. ఇక నుంచి ఆయన్ను అందరూ అదే పేరుతో పిలుస్తారు. వాటికన్ సిటీలో రెండు రోజుల పాటు సమావేశమైన ఆర్చ్ బిషప్ లు, కొత్త పోప్ ను ఎన్నుకొన్నారు. కొత్త పోప్ ఎంపికైనట్టు సూచికంగా వాటికన్ సిటీలోని పురాతన చర్చిలో చిమ్నీ నుంచి తెల్లటి పొగను వదిలారు. ఒక పోప్ మరణించి.. కొత్త పోప్ ను ఎన్నుకొన్న తర్వాత ఇలా తెల్లటి పొగను వదలడం సంప్రదాయం. ఒకవేళ చర్చలు పూర్తి కాకుండా.. కొత్త పోప్ ను ఎన్నుకోకపోతే నల్లటి పొగను వదులుతారు.

అమెరికా నుంచి తొలి పోప్
అమెరికా నుంచి ఎన్నికైన తొలి పోప్ గా ప్రెవోస్ట్ చరిత్ర సృష్టించారు. అమెరికాలోని చికాగోలో జన్మించారు. ఆయన వయసు 69 సంవత్సరాలు. ఆయనకు అమెరికా, పెరూ రెండు దేశాల పౌరసత్వం ఉంది. పోప్ గా ఎన్నిక కాకముందు ఆయన వాటికన్ లోని డికాస్టరీ ఫర్ బిషప్స్ ప్రిఫెక్ట్ గా, పాంటిఫికల్ కమిషన్ ఫర్ లాటిన్ అమెరికా అధ్యక్షుడిగా సేవలు అందించారు. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా బిషప్ లను నియమించే అత్యంత కీలక బాధ్యతలను నిర్వర్తించారు.