రూ. 2 కోట్ల కారు..కొన్న కాసేపటికే

  • Published By: madhu ,Published On : June 26, 2020 / 12:38 AM IST
రూ. 2 కోట్ల కారు..కొన్న కాసేపటికే

Updated On : June 26, 2020 / 12:38 AM IST

ఎంతో మోజు పడి..ముచ్చట పడి..కారు కొన్నాడు. తాను ఎంతో కలలు కని..కొన్న కారును అందరికీ చూపిద్దామని..గర్వంగా ఫీయిలయ్యాడు. దాదాపు రూ. 2 కోట్లు పెట్టి కొన్న కారు కాసేపటికే ధ్వంసం కావడంతో అతనికి ఏమి చేయాలో అర్థం కాలేదు. తాను ఎంతో ముచ్చటపడి కొన్న కారు తన కళ్లెదుటే నుజ్జునుజ్జు కావడం..అతని తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.

ఈ ఘటన లండన్ లో చోటు చేసుకుంది. బ్రిటన్ లోని వేక్ ఫీల్డ్ లో ఓ వ్యక్తి సుమారు రూ. 2 కోట్లు పెట్టి..గ్రే కలర్ లంబోర్గిని హరికేన్ స్పైడర్ మోడల్ కారును కొనుక్కొన్నాడు. అత్యంత ఖరీదైన కారును అందరికీ చూపించాలని కారు కీస్ తీసుకుని షోరూం నుంచి బయటకొచ్చాడు.

కారులో ఎక్కి..రయ్ అంటూ బయలుదేరాడు. కానీ అంతలోనే ఏమైందో ఏమో…కారులో టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడంతో సడెన్ గా ఆగింది. కారును పక్కకు తీద్దామని ప్రయత్నించాడు. కానీ..అప్పటికే వెనుక నుంచి వచ్చిన కారు వేగంగా ఢీ కొట్టింది.

దీంతో కారు వెనుక భాగం మొత్తం నుజ్జునుజ్జైంది. కారు కొన్న కేవలం 20 నిమిషాల లోపే ఇలా కావడం ఎంతో ఆవేదనకు గురయ్యాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కారు యజమాని పరిస్థితిపై నెటిజన్లు జాలీ పడుతూ కామెంట్లు పెడుతున్నారు.