Russia Ukraine War : రష్యాపై యుక్రెయిన్ ఫిర్యాదు.. మార్చి 7, 8న ఐసీజేలో విచారణ!

Russia Ukraine War : రష్యా-యుక్రెయిన్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఇరుదేశాల మధ్య యుద్ధం ఏడో రోజుకు చేరుకుంది. యుక్రెయిన్ సంక్షోభంపై ప్రపంచ దేశాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Russia Ukraine War : రష్యా-యుక్రెయిన్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఇరుదేశాల మధ్య యుద్ధం ఏడో రోజుకు చేరుకుంది. యుక్రెయిన్ సంక్షోభంపై స్పందించిన ప్రపంచ దేశాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రష్యా అధ్యక్షుడు నియంతలా వ్యవహరిస్తున్నారని, దురాక్రమణ ఆపకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాయి. అయినా పుతిన్ వెనక్కి తగ్గకపోగా.. ఇప్పుడు అణు ప్రయోగానికి కూడా సన్నద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరో కఠినమైన నిర్ణయం తీసుకున్నారు.

రష్యా తీర జలాల్లో న్యూక్లియర్ డ్రిల్స్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే తీర జలాల్లో వ్యూహత్మక ప్రాంతాలకు రష్యా సబ్ మెరైన్లు చేరుకున్నట్టు తెలుస్తోంది. రష్యా చేపట్టే న్యూక్లియర్ డ్రిల్స్‌లో పలు న్యూక్లియర్ సబ్ మెరైన్లు పాల్గొంటున్నాయి. సైబిరియా మంచు అడవుల్లో మొబైల్ లాంచర్లను రష్యన్ ఆర్మీ మోహరించింది. బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించేందుకు అవసరమైన లాంచర్లను కూడా మోహరిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ విషయాన్ని రష్యా నార్తన్ ఫ్లీట్ అధికారికంగా ప్రకటించింది.

Russia Ukraine War Icj To Hold Public Hearings On Ukraine Russia Crisis On March 7-8

Russia Ukraine War : యుద్ధం ఆరంభమైన మూడో రోజే యుక్రెయిన్ ఫిర్యాదు :
యుక్రెయిన్‌పై రష్యా దాడిని అంతర్జాతీయంగా వ్యతిరేకంగా వ్యక్తమవుతోంది. పాశ్చాత్య దేశాలన్నీ వ్యతిరేకించినప్పటికీ.. రష్యా మాత్రం దాడి చేయడం ఆపడం లేదు. అణు ప్రయోగానికి కూడా రష్యా రెడీ అవుతున్న తరుణంలో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ రంగంలోకి దిగింది. రష్యా దురాక్రమణపై ఇప్పటికే యుక్రెయిన్ అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ)కు ఫిర్యాదు కూడా చేసింది. ఈ క్రమంలోనే రష్యా-యుక్రెయిన్ యుద్ధంపై ఐసీజే విచారణ చేపట్టనుంది. అందుకు తేదీలను కూడా ఖరారు చేసింది. ఈ నెల 7, 8వ తేదీల్లో విచారించనున్నట్టు ICJ పేర్కొంది. ఏడు రోజులుగా రష్యా ఏకధాటిగా చేస్తున్న దాడులతో యుక్రెయిన్‌లో ఎంతోమంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే కీవ్ నగరంలో తీవ్రమైన ఆస్తినష్టం వాటిల్లింది. మానవ హక్కుల ఉల్లంఘన వంటి అంశాలపై అంతర్జాతీయ న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.

ఐసీజే ప్రాసిక్యూటర్ కరీమ్ ఖాన్ ఇదే విషయాన్ని వెల్లడించారు. సమగ్ర విచారణకు యుక్రెయిన్ దాఖలు చేసిన పిటీషన్‌కు అర్హతలు ఉన్నాయని కరీమ్ ఖాన్ పేర్కొన్నారు. యుద్ధ నేరాలపై ఇరు రెండు దేశాలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటోన్నాయని తెలిపారు. యుద్ధం ఆరంభమైన మూడో రోజునే యుక్రెయిన్ ప్రభుత్వం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ చట్టాల ప్రకారం.. రష్యాపై మరిన్ని ఆంక్షలు, నిషేధాలను విధించేలా ఐసీజీలో యుక్రెయిన్ పిటిషన్ దాఖలు చేసింది. తద్వారా తక్షణమే రష్యా యుద్ధాన్ని నిలిపివేసేలా ఆదేశాలను ఇవ్వాలని పిటిషన్‌లో కోరింది.

Read Also  : Russia ukraine war : 64 కిలోమీటర్ల పొడవైన ఆయుధ కాన్వాయ్ తో కీవ్ వైపు దూసుకొచ్చిన రష్యా ఆర్మీ..

ట్రెండింగ్ వార్తలు