Russia ukraine war : 64 కిలోమీటర్ల పొడవైన ఆయుధ కాన్వాయ్ తో కీవ్ వైపు దూసుకొచ్చిన రష్యా ఆర్మీ..

64కిలోమీటర్ల పొడవున్న ఆయుధ కాన్వాయ్ తో కీవ్ ను చుట్టుముట్టటానికి రష్యా సైన్యందూసుకొచ్చింది. కీవ్ ను స్వాధీనం చేసుకునిఅధికారాన్ని హస్తగతం చేసుకోవాలని రష్యా..కాపాడుకోవాలని యుక్రెయిన్

Russia ukraine war : 64 కిలోమీటర్ల పొడవైన ఆయుధ కాన్వాయ్ తో కీవ్ వైపు దూసుకొచ్చిన రష్యా ఆర్మీ..

Russia Ukraine War 64kme Russian Military Convoy Heads Towards Kyiv

Russia ukraine war : యుక్రెయిన్ రాజధానిని స్వాధీనం చేసుకుంటే ఇక దేశాన్ని తమ స్వాధీనం అయిపోయినట్లేనని భావిస్తోంది రష్యా. ఇక యుక్రెయిన్ లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని తన సైన్యానికి అధ్యక్షుడు పుతిన్ ఇచ్చిన ఆదేశాల మేరకకు రాజధాని కీవ్ ను స్వాధీనం చేసుకోవటానికి రష్యా సేనలు ఎంతగానో యత్నిస్తున్నాయి. కానీ యుక్రెయిన్ సేనలు మాత్రం తమ రాజధాని కీవ్ ను ఎట్టి పరిస్థితుల్లోను రష్యాకు దక్కనిచ్చేది లేదంటూ రక్షణకవచంలా మారి కాపాడుకుంటున్నారు. ఈక్రమంలో రష్యా ఎలాగైనా కీవ్ ను స్వాధీనం చేసుకోటానికి ఏకంగా అత్యంత భారీ ఆయుధ కాన్వాయ్ ను రంగంలోకి దింపింది.

Also read : Russia Soldier Last Message:గుండెల్నిపిండేసే రష్యా సైనికుడి చివరి సందేశం’సామాన్యులనూ చంపేస్తున్నాం,నాకు బతకాలనిలేదమ్మా..

ఏకంగా 64 కిలోమీటర్ల పొడువున్న ఆయుధ కాన్వాయ్ తో రాజధానిని చుట్టుముట్టటానికి రష్యా సైన్యం దూసుకొస్తోంది. కీవ్ వైపు 64 కిలోమీటర్ల పొడవైన రష్యా సైన్యం కాన్వాయ్ కు సంబంధించి శాటిలైట్ ఫోటోలు సోషల్ మీడియలో వైరల్ గా మారాయి. సైనిక కాన్వాయ్ లో ఆయుధాలు, యుద్ధ ట్యాంకులు, ఫిరంగులు శాటిలైట్ చిత్రాల ఆధారంగా గుర్తించారు మాక్సర్ టెక్నాలజీస్.

యుక్రెయిన్ పై మరింత పెద్ద ఎత్తున దాడికి రష్యా యత్నిస్తోంది. రష్యా ముందు యుక్రెయిన్ ఎంతలే అని అనుకున్న రష్యాకు యుక్రెయిన్ ధీటుగా సమాధానంచెబుతోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ కు ఉత్తర దిక్కు నుంచి రష్యా సైన్య వాహన శ్రేణి పెద్ద ఎత్తున ముందుకు కదిలింది. 64 కిలోమీటర్ల మేర వున్న రష్యా సైనికుల కాన్వాయ్ ముందుకు సాగుతున్నట్లు అమెరికా టెక్నాలజీ సంస్థ మాక్సర్ టెక్నాలజీస్ తీసిన శాటిలైట్ చిత్రాలు తెలియజేస్తున్నాయి.

Also read : Russia ukraine war : రష్యా యుద్ధ ట్యాంక్ ను ఎత్తుకుపోయిన యుక్రెయిన్ రైతు…లబోదిబోమన్న రష్యన్

గతంలో తీసిన చిత్రాలను పరిశీలిస్తే అప్పుడు 27 కిలోమీటర్ల మేరే రష్యా సైన్యం కనిపించగా..ఇప్పుడు అది రెట్టింపు కావడం వాస్తవ పరిస్థితిని కళ్లకు కడుతోంది. ఆయుధాలతో కూడిన వాహనాలు, యుద్ధ ట్యాంకులు, ఫిరంగులు, కావాల్సిన సామగ్రితో కూడిన వాహనాలు రష్యా సైనిక కాన్వాయ్ దూసుకొచ్చాయి.దక్షిణ బెలారస్ లో క్షేత్రస్థాయిలో సైనికుల మోహరింపు, హెలికాప్టర్ యూనిట్లు కూడా శాటిలైట్ ఫొటోల్లో కనిపించాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ పట్టణానికి 24 కిలోమీటర్ల దూరంలోని ఆంటనోవ్ ఎయిర్ పోర్ట్ దిశగా రష్యా సైనిక కాన్వాయ్ ప్రయాణం చేస్తున్న ఫోటోలు కనిపిస్తున్నాయి.

మరోపక్క, రష్యా, ఉక్రెయిన్ మధ్య బెలారస్ లో సోమవారం (మార్చి 1,2022) జరిగిన మొదటి విడత చర్చలు ఎటువంటి ఫలితం ఇవ్వకుండానే ముగిశాయి. మరో సారి కూడా చర్చించాలని భావిస్తున్నాయి అటు రష్యా ఇటు యుక్రెయిన్లు. మరి రెండో విడత చర్చల్లో పురోగతి సాధించి యుద్ధం ఆగిపోవాలని కోరుకుందాం.

Also read : Russia-Ukraine war : నడిరోడ్డుపై రష్యా ల్యాండ్‌మైన్‌..నోటిలో సిగిరెట్ ఉంచుకునే ఒట్టి చేతులతో తీసేసిన యుక్రెయిన్ పౌరుడు

కాగా..కీవ్‌ వైపు 64 కిలోమీటర్ల మేర రష్యన్‌ ట్యాంకర్లు బారులు తీరి… రాజధాని వైపు దూసుకెళ్లాయి. జనావాసాల పైనా బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో ప్రజలు సబ్‌ వేలు, బంకర్లలో తలదాచుకుంటున్నారు. అయితే ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడం వారికి ఇబ్బందిగా మారింది. మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. మంచు కీవ్‌ని కప్పేసింది. దీంతో పరిస్థితి సంక్లిష్టంగా మారింది. సోమవారం 36 గంటల కర్ఫ్యూ తర్వాత మొదటిసారిగా తెరిచినప్పటి నుంచి ప్రజలు నగరంలోని కిరాణా దుకాణాలు మరియు ఫార్మసీల వద్ద చాలా గంటలు వేచి చూడాల్సి వచ్చింది. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితులు కొత్త అవస్థలు తెచ్చిపెడుతున్నాయి.