అణుయుద్ధానికి సిద్ధం అంటున్న రష్యా..! నెక్ట్స్ ఏం జరగబోతోంది?

ఏ క్షణానికి ఎవరు ఎలా స్పందిస్తారు అనేది టెన్షన్ పెడుతోంది.

అణుయుద్ధానికి సిద్ధం అంటున్న రష్యా..! నెక్ట్స్ ఏం జరగబోతోంది?

Updated On : November 1, 2024 / 9:07 AM IST

Russia Begins Nuclear Drill : రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం మరింత తీవ్రం అయ్యేలా కనపడుతోంది. రష్యా ఇప్పుడు అణు బలగాలతో ప్రత్యేక కసరత్తు స్టార్ట్ చేసింది. అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలతో న్యూక్లియర్ స్పెషల్ వింగ్స్ ను షురూ చేయడం ఇప్పుడు టెన్షన్ పెడుతోంది. ఇటు ఇజ్రాయెల్ హమాస్ హెజ్ బొల్లా ఇరాన్ లపై వరుసగా విరుచుకుపడుతోంది. దీంతో పశ్చిమాసియాలో యుద్ధం ఆరని జ్వాలలా రగులుతూనే ఉంది. ఏ క్షణానికి ఎవరు ఎలా స్పందిస్తారు అనేది టెన్షన్ పెడుతోంది. అంతలా రగులుతోంది పశ్చిమాసియా.

రష్యా యుక్రెయిన్ మధ్య రెండున్నరేళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధం ఇంకా చల్లారే పరిస్థితి కనిపించడం లేదు. ఒకరినొకరు కవ్వించుకుంటూ కదనానికి కాలు దువ్వుతూనే ఉన్నారు. ఈ టెన్షన్స్ రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి టైమ్ లో రష్యా అధ్యక్షుడు పుతిన్ అణ్వాయుధాలతో స్పెషల్ డ్రిల్ ప్రారంభించారు. యుక్రెయిన్ తో నెక్ట్స్ లెవెల్.. ఇక అణు యుద్ధమే జరగబోతోందనే సంకేతాలు పంపారు.

గత 15 రోజుల వ్యవధిలో పుతిన్ ప్రారంభించిన రెండోవ సైనిక కసరత్తు ఇది. దీంతో అంతకంతకు పెరిగిపోతున్న ఈ ఉద్రిక్తతలు ఎలా తగ్గించాలో తెలియక పశ్చిమ దేశాల నేతృత్వంలోని నాటో కూటమి తల పట్టుకుంటోంది. రష్యాలోని సుదూర భూభాగాలను సైతం తన లక్ష్య పరిధిలోకి తెచ్చుకునేలా, లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణులను ఉపయోగించేలా యుక్రెయిన్ కు అనుమతి ఇవ్వాలని అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య దేశాల నాటో దళాలు ఆలోచిస్తున్నాయి. దీనికి కౌంటర్ గా రష్యా కూడా సై అంటూ కాలు దువ్వుతోంది.

పాశ్చాత్య దేశాల మద్దతుతో యుక్రెయిన్ ఎలాంటి దాడికైనా పాల్పడితే.. దేశ రక్షణ, సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు తాము ఎంతవరకైనా తెగిస్తామని, అవసరమైతే అణ్వాయుధాలను ప్రయోగించడానికి కూడా వెనుకాడమని పుతిన్ ఈ మధ్యే గట్టిగా హెచ్చరించారు. అంతేకాదు అణ్వాయుధాల వినియోగానికి సంబంధించి నిబంధనల్లో కూడా మార్పులు చేసింది రష్యా.

నువ్వు కాలికి వేస్తే నేను వేలుకి వేస్తా. నువ్వు కళ్లను పొడిస్తే నేను తలకాయే లేపేస్తా. ఇలా ఉంది ఇజ్రాయెల్ తీరు. పశ్చిమాసియాలో హమాస్ హెజ్ బొల్లాను అంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఇజ్రాయెల్ కు ఇప్పుడు ఇరాన్ కూడా టార్గెట్ అయ్యింది. ఇరాన్ అండతో రెచ్చిపోయిన హెజ్ బొల్లా పెద్ద తలకాయలను లేపేస్తూ వచ్చింది ఇజ్రాయెల్. ఇప్పుడు కొత్త చీఫ్ గా ఖాసింను నియమించారు. అయితే, హెజ్ బొల్లా నూతన అధిపతికి కూడా నూకలు చెల్లే కాలం దగ్గర పడిందని డెత్ వార్నింగ్ ఇచ్చేసింది ఇజ్రాయెల్. అదే జరిగితే ఇరాన్ ఊరుకుంటుందా? ఇది ఎక్కడికి దారి తీస్తుంది?

 

Also Read : ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం..! అమెరికా రియాక్షన్ ఎలా ఉండే ఛాన్స్ ఉంది?