ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం..! అమెరికా రియాక్షన్ ఎలా ఉండే ఛాన్స్ ఉంది?

ఏడాదిగా యుద్ధాలతోనే కాలం వెళ్లదీస్తున్న ఇజ్రాయెల్ ను వెంటాడుతున్న టెన్షన్స్ ఏంటి?

ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం..! అమెరికా రియాక్షన్ ఎలా ఉండే ఛాన్స్ ఉంది?

Updated On : November 1, 2024 / 8:16 AM IST

Israel Iran War : ఈసారి కొట్టే దెబ్బ మామూలుగా ఉండదు. ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ పదే పదే చెబుతున్న మాట ఇది. అమెరికా వార్నింగ్ ను ఏ మాత్రం పట్టించుకోకుండా ఇజ్రాయెల్ పై దాడులకు ఇరాన్ సిద్ధమవుతోంది. ఇజ్రాయెల్ ను కమ్మేస్తాం, ప్రతీకారం అంటే ఏంటో చూపిస్తాం అన్నట్లుగా స్కెచ్ వేస్తోంది. ఏం చెప్పి మరి కొట్టబోతోంది? ఇంతకీ ఇరాన్ ఏం చేయబోతోంది? ఇరాన్ తీరుతో అమెరికా రియాక్షన్ ఎలా ఉండే ఛాన్స్ ఉంది?

ఇరాన్ దాడులకు దిగితే ఊహించని విధ్వంసం చూస్తామని ఇజ్రాయెల్ అంటోంది. అసలు ఇరాన్ ఎలాంటి దాడులకు దిగబోతోంది? స్కెచ్ ఏంటి? ఇరాన్ దాడులతో యుద్ధానికి దారితీస్తే ప్రతిఘటించే శక్తి ఇజ్రాయెల్ కు ఉందా? ఏడాదిగా యుద్ధాలతోనే కాలం వెళ్లదీస్తున్న ఇజ్రాయెల్ ను వెంటాడుతున్న టెన్షన్స్ ఏంటి?

ఇజ్రాయెల్ మీద ఇరాన్ రెండుసార్లు దాడులు చేసింది. అక్టోబర్ 26న ఇరాన్ సైనిక స్థావరాలు, క్షిపణి తయారీ కేంద్రాలు టార్గెట్ గా ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ ఘటనలో నలుగురు ఇరాన్ సైనికులు కూడా చనిపోయారు. సైనిక స్థావరాలు భారీగానే ధ్వంసం అయినట్లు ప్రచారం జరిగింది. అయితే, బాధతో చేసే యుద్ధం ఎలా ఉంటుందో చూపిస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్.

ఇజ్రాయెల్ సైనిక స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేసుకునే అవకాశం ఉంది. అమెరికా ఎన్నికలకు ముందే దాడులకు దిగేందుకు ఇరాన్ సిద్ధమవడం అంటే.. ఇది ఒక రకంగా అమెరికాకు సవాల్ విసరడమే. ఇరాన్ దాడులు చేస్తే కనుక.. అది యుద్ధానికి దారితీయడం ఖాయం అంటున్నారు నిపుణులు. ఇక, అమెరికా కూడా డైరెక్ట్ గా ఎంట్రీ ఇవ్వడం ఖాయం అంటున్నారు. అదే జరిగితే.. ప్రపంచంలో చాలా పరిణామాలు మారిపోయే ఛాన్స్ ఉంటుంది.

ఏడాదిగా యుద్ధంలోనే గడుపుతున్న ఇజ్రాయెల్.. ఇప్పుడు ఇరాన్ తో పోరాడగలదా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. హమాస్ మెరుపు దాడి తర్వాత గాజాపై ప్రతీకార దాడితో మొదలైన ఇజ్రాయెల్ పోరు.. ఏడాదిగా కంటిన్యూ అవుతూనే ఉంది. లెబనాన్ లోని హెజ్ బొల్లాతోనూ యుద్ధం చేస్తోంది. దీంతో ఇజ్రాయెల్ సైన్యానికి బలగాల కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే లక్షల మంది రిజర్విస్టుల సేవలను వినియోగించుకున్న ఇజ్రాయెల్ సైన్యం.. వారి గడువు ముగుస్తుండటం, కొత్త సైన్యాన్ని నియమించుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం.

పూర్తి వివరాలు..

Also Read : ఉత్తర కొరియాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అమెరికా.. కిమ్ ఏమన్నాడంటే?