Russia Ukraine War : శరణార్థుల కాన్వాయ్‌ పై రష్యా కాల్పులు..చిన్నారితో సహా ఏడుగురు మృతి

నివాసితుల గృహాలపై రష్యా క్షిపణి దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఓ చిన్నారితో సహా ఎనిమిదిమంది మృతి చెందారని యుక్రెయిన్ ప్రభుత్వం తెలిపింది.

Russian Forces Desroy Seven Civilians: యుక్రెయిన్‌పై రష్యా 18 రోజులుగా యుద్ధం కొనసాగిస్తునే ఉంది. మధ్యలో కాస్త మానవతా విరామాన్ని ఇచ్చింది. సామాన్యలు, విదేశస్తులు వెళ్లటానికి మధ్యలో కాస్త విరామం ఇచ్చింది..ఆ తరువాత యుద్ధాన్ని ఉదృతం చేసింది. వరుస బాంబు దాడులతో విరుచుకుపడుతునే ఉంది. రష్యా యుద్ధం ప్రారంభించాక యుక్రెయిన్ పౌరులను లక్ష్యంగా చేసుకోలేదు.కేవలం యుక్రెయిన్ సైన్యంపైనే దృష్టి పెట్టింది. ప్రభుత్వంపైనా అలాగే అధికారం చేజిక్కించుకోవటంపైనే గురి పెట్టింది. ఇప్పటికే లక్షలాదిమంది పౌరులు దేశం వదిలి ఇతర దేశాలకు వెళ్లిపోయారు. వెళుతునే ఉన్నారు.

Also read : Biological, Chemical Weapons : యుక్రెయిన్​-రష్యా యుద్ధం.. తెరమీదికి జీవ, రసాయన ఆయుధాలు

ఈక్రమంలో నివాసితుల గృహాలపై క్షిపణి దాడులు నిర్వహించింది. ఇక అంతటి ఆగకుండా ఇప్పుడు మహిళలు, చిన్నారులు అని కూడా చూడకుండా వారిపై దాడులు చేస్తుంది. దీంట్లో భాగంగా యుక్రెయిన్‌ రాజధాని కైవ్‌కి 36 కి.మీ దూరంలో ఉన్న పెరెమోగా అనే చిన్న గ్రామంలోని ప్రజలను తరలిస్తున్న శరణార్థుల కాన్వాయ్‌ పై రష్యా బహిరంగంగా కాల్పుల జరిపింది.

Also read  Russian Mercenary Army : యుక్రెయిన్‌లో రష్యా కిరాయి సైన్యం.. రంగంలోకి 16 వేల మంది వాలంటీర్లు

ఈ ఘటనలో ఓ చిన్నారితో సహా ఏడుగురు మృతి చెందారని..యుక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ సర్వీస్ తెలిపింది.‘పెరెమెగా’ అంటే యుక్రెనియల్‌లో విజయం అని అర్థమట. రష్యన్‌ యుద్ధ ట్యాంకులు ఈ పెరెమెగా గ్రామం మీదుకు రాజధాని కైవ్‌ వైపుకు దూసుకుపోతు​న్నాయి.

ట్రెండింగ్ వార్తలు