Ukraine Tells The Us It Needs 500 Javelins And 50 Stingers Per Day
Russia ukraine war : అమెరికా ముందు యుక్రెయన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కొత్త డిమాండ్ పెట్టారు. రష్యాతో యుద్ధం కొనసాగించాలంటే తమకు రోజుకు 1000 ఆయుధాలు (క్షిపణులు) కావాలి అని కోరారు. అత్యంత శక్తివంతమూన ఆయుధాలు కలిగిన రష్యాను అడ్డుకోవాలంటే తమకు రోజుకుకు కనీసం 1000 క్షిపణులు అవసరమని యుక్రెయిన్ అమెరికాను డిమాండ్ చేసింది. రష్యాతో పోరుకు తమకు రోజుకు 1000 క్షిపణులు అవసరమని కోరింది.
Also read : Ukraine Russia war: యుద్ధం కాదు, సహాయంపై నాటో స్పందించకపోవడమే దారుణ విషయం: జెలెన్స్కీ
అమెరికాకు చెందిన జావెలిన్, స్టింగర్ క్షిపణలు ఒక్కోటి 500 చొప్పున రోజువారీ అవసరమని కోరింది. యుక్రెయిన్ భారీ ఎత్తున యాంటీ ట్యాంక్, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ క్షిపణులను కోరుతోందని తేలింది. ఆయుధాల కొరత ఏర్పడటంతో పశ్చిమ దేశాల నుంచి సాయం పెంచాలని యుక్రెయిన్ కోరింది. రష్యాను కట్టడి చేయటానికి అమెరికాతో పాటు నాటో దేశాలు యుక్రెయిన్ కు ఆయుధాలను అందిస్తున్నాయి. దీంతో శక్తివంతమైన రష్యా ఆయుధాలను..సేనలు యుక్రెయిన్ నియంత్రిస్తోంది.
మార్చి 7వ తేదీ నాటికి అమెరికా, నాటో దేశాలు కలిపి మొత్తం 17,000 యాంటీ ట్యాంక్ క్షిపణులు, 2,000 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ క్షిపణులను యుక్రెయిన్‌కు అందజేశాయి. అంతేకాదు.. ఉక్రెయిన్‌కు ఆయుధ సరఫరా నిరంతరం కొనసాగేట్లు అమెరికా చర్యలు తీసుకొంది. దీంతోపాటు బిలియన్ డాలర్లకుపైగా విలువైన ప్యాకేజీలను ఇప్పటికే ఉక్రెయిన్‌కు అందజేయడం మొదలుపెట్టింది.
Also read : Russia Ukraine War : రష్యా యుక్రెయిన్ యుద్ధానికి నెల రోజులు
కాగా నెల రోజుల నుంచి యుక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యా ఇప్పటికీ యుక్రెయిన్ ను స్వాధీనం చేసుకోలేకపోతోంది. దీనికి కారణం యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పోరాటపటిమేననే ప్రచారం జరుగుతోంది. జెలెన్ స్కీ ఎప్పటికప్పుడు తన సైన్యానికి ధైర్యాన్ని..ఆత్మస్థైర్యాన్ని నూరిపోస్తునే ఉన్నారు.ఏమాత్రం తగ్గేదేలేదు అంటూ ప్రోత్సహిస్తున్నారు. జెలెన్ స్కీ స్వయంగా గాయపడిని సైనికులను పరామర్శించటానికి వెళ్లుతున్నారు.వారికి మీకు నేనున్నాను అనే ధైర్యాన్నిస్తున్నారు. దీంతో యుక్రెయిన్ సైన్యం కూడా రష్యా సైన్యానికి ధీటుగా సమాధానం చెబుతోంది.
Also read : America : చైనాకు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్.. ‘రష్యాకు సాయం చేస్తే తీవ్ర పరిణామాలు’