Russia Ukraine War : రష్యా యుక్రెయిన్‌ యుద్ధానికి నెల రోజులు

గత నెల ఇదే రోజున యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలుపెట్టింది. బెలారస్ సరిహద్దుల నుంచి యుక్రెయిన్‌లోకి ప్రవేశించించిన రష్యా బలగాలు తూర్పు యుక్రెయిన్‌ మొత్తాన్ని ఆక్రమించేసింది.

Russia Ukraine War : రష్యా యుక్రెయిన్‌ యుద్ధానికి నెల రోజులు

Russia Ukraine (1)

Russia Ukraine war : రెండ్రోజుల్లో యుక్రెయిన్‌ను స్వాధీనం చేసుకుంటామన్న రష్యా కలలు కల్లలయ్యాయి. రష్యా- యుక్రెయిన్‌ యుద్ధం నెలరోజులకు చేరుకుంది. ఇప్పటికి కూడా పుతిన్‌సేన యుక్రెయిన్‌ను ఓడించలేకపోయింది. ఫిబ్రవరి 24న మొదలైన యుద్ధం.. అలుపు లేకుండా ఇంకా కొనసాగుతోంది. యుక్రెయిన్‌ ఆర్మీ ఎదురొడ్డి పోరాడుతోంది. యుక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు సమీపంలోకి రష్యా సేనలు రాకుండా యుక్రెయిన్‌ వీరులు ఎదురుదాడికి దిగుతున్నారు.

సరిగ్గా.. గత నెల ఇదే రోజున యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలుపెట్టింది. బెలారస్ సరిహద్దుల నుంచి యుక్రెయిన్‌లోకి ప్రవేశించించిన రష్యా బలగాలు.. తూర్పు యుక్రెయిన్‌ మొత్తాన్ని ఆక్రమించేసింది. దీంతో యుక్రెయిన్‌ ఆ రోజునే ఎయిర్‌స్పేస్‌ను మూసేసింది. రష్యా సైన్యం దాడుల్లో యుక్రెయిన్‌ మిలటరీ స్థావరాలు ధ్వంసమయ్యాయి. యుద్ధం మొదటి రోజే.. రష్యాకు చెందిన ఐదు సైనిక విమానాలను యుక్రెయిన్‌ సేనలు కూల్చేశాయి.

Russia Putin : యుక్రెయిన్‌ను ఆక్రమించుకోవాలన్న ఉద్దేశం రష్యాకు లేదు : పుతిన్

అటు.. యుక్రెయిన్‌ ప్రభుత్వ వెబ్‌సైట్లపై రష్యా సైబర్ ఎటాక్‌ చేసింది. ఆ తర్వాత ఇన్నిరోజులుగా యుద్ధం కంటిన్యూ అవుతూనే ఉంది. ఎన్ని సార్లు చర్చలు జరిపినా ఫలితం లభించలేదు. అయినప్పటికీ తమ దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టి యుక్రెయిన్‌ సైనికులు, ప్రజలు పోరాడుతున్నారు. ఈ యుద్ధంలో యుక్రెయిన్‌ ఘోరంగా నష్టపోయినా, రష్యాను కూడా భారీగానే దెబ్బకొట్టింది.

రష్యా దాడులతో అందమైన నగరం మరియుపోల్‌ మరుభూమిగా మారింది. భవనాలన్నీ మంటల్లో తగలబడిపోయాయి. నగరంలో ఎటు చూసినా బూడిదే కనిపిస్తోంది. రష్యా బాంబు దాడుల్లో ఇప్పటికే 3 వేల మంది పౌరులు మరణించారు. అనేక కట్టడాలు నేలమట్టమయ్యాయి. దాదాపు మూడున్నర లక్షల మంది వలసబాట పట్టారు. మరో లక్షమందికి పైగా మరియుపోల్‌లో చిక్కుకున్నారని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. నిన్న 7 వేలమందికిపైగా నగరం నుంచి తప్పించుకున్నారని చెప్పారు.

Biological, Chemical Weapons : యుక్రెయిన్​-రష్యా యుద్ధం.. తెరమీదికి జీవ, రసాయన ఆయుధాలు

కానీ శిథిలాలో ఇంకా చాలామంది చిక్కుకున్నారని తెలిపారు. మరియుపోల్ పౌరుల‌కు అవసరమైన ఆహారం, ఇతర సామాగ్రిని అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అటు రష్యా సేనలను ఉక్రెయిన్ బలగాలు తీవ్రంగానే ప్రతిఘటిస్తున్నాయని చెప్పారు. కీవ్‌కు సమీపంలో ఒక పట్టణాన్ని రష్యా సేనల నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. నాలుగున్నర లక్షల జనాభా కలిగిన మరియుపోల్‌లో యుద్ధం కారణంగా వలసలు పెరిగాయి.

దాడుల మొదలైన తర్వాత కొందరు పొరుగు దేశాలకు వలస వెళ్లారు. మరికొందరిని అధికారులు సురక్షిత ప్రాంతాలకి తరలించారు. లక్ష మందికి పైగా నగరంలోనే చిక్కుకుపోయారు. నిత్యం బాంబుల మోతతో బయటకు రాలేక వీరంతా ఇళ్లల్లోనే బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. గత మూడు వారాలుగా మరియుపోల్‌లో బాంబుల జడివాన కురుస్తోందని, దాదాపు ఏ భవనమూ అక్కడ మిగల్లేదని నగరం నుంచి బయటపడ్డ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.