Ukraine Russia war: యుద్ధం కాదు, సహాయంపై నాటో స్పందించకపోవడమే దారుణ విషయం: జెలెన్స్కీ

చూస్తూ వుంటే మేము మా ఉమ్మడి విలువలను కాపాడుకునే విషయం..పశ్చిమ దేశాలు మరియు రష్యాల మధ్య చీకటి అంశంగా ఉన్నట్లు అనిపిస్తుంది" అని జెలెన్స్కీ అన్నారు

Ukraine Russia war: యుద్ధం కాదు, సహాయంపై నాటో స్పందించకపోవడమే దారుణ విషయం: జెలెన్స్కీ

Zelensky

Ukraine Russia war: యుక్రెయిన్ పై రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. సరిగా నెల రోజుల క్రితం ప్రారంభమైన ఈ యుద్ధం తీవ్ర ప్రాణ ఆర్ధిక నష్ఠాన్ని మిగిల్చింది. యుద్ధాన్ని ఆపాలంటూ పశ్చిమ, యురోపియన్ దేశాలు సహా..నాటో కూటమి దేశాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వలేదు. నాటోపై యుక్రెయిన్ వెనక్కుతగ్గి, కీవ్ ను తమ వసం చేసేవరకు యుద్ధం కొనసాగిస్తామని రష్యా పెట్రేగి పోతుంటే..నిస్సహాయ స్థితిలో యుక్రెయిన్ విలవిలాడుతోంది. అయితే రష్యా దాడులను ఒంటరిగానే పోరాడుతున్న యుక్రెయిన్..ప్రపంచమే ఆశ్చర్యపోయేలా రష్యా సైన్యానికి చుక్కలు చూపిస్తుంది. నెల రోజులుగా జరుగుతున్న భీకర యుద్ధంలో..యుక్రెయిన్ సైనికులు, పౌరులు తమ దేశ రక్షణ కోసం ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడుతున్నారు.

Also Read:Pakistan vs Australia : పాక్‌తో మూడో టెస్టు.. ఆసీస్ స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డు..!

అయితే ఈ యుద్ధంపై రష్యా హెచ్చరికల నేపథ్యంలో యుక్రెయిన్ కు సహాయం చేసేందుకు ఏ ఒక్క దేశం సాహసించలేదు. కనీసం నాటో సభ్య దేశాలు కూడా యుక్రెయిన్ కు ఎటువంటి సహాయం చేయలేదు. యుద్ధంలో రష్యాపై పోరాడేందుకు తమకు అత్యాధునిక ఆయుధాలు ఇవ్వాలంటూ పలుమార్లు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నాటో దేశాలను అభ్యర్ధించినా వారి నుంచి స్పందన కరువైంది. ఇదే విషయంపై గురువారం అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడుతూ..ఈ యుద్ధంలో మనుషుల మరణాలకంటే దారుణమైన విషయం ఏంటంటే..సహాయం కోసం అభ్యర్ధించినా మిత్ర దేశాలు సహాయం చేయకపోవడమే” అంటూ విచారం వ్యక్తం చేశారు.

Also read:US Aquaculture : మంత్రి కేటీఆర్ అమెరికా టూర్.. పెట్టుబడులకు అమెరికా సంస్థల ఆసక్తి

“చూస్తూ వుంటే మేము మా ఉమ్మడి విలువలను కాపాడుకునే విషయం..పశ్చిమ దేశాలు మరియు రష్యాల మధ్య చీకటి అంశంగా ఉన్నట్లు అనిపిస్తుంది” అని జెలెన్స్కీ గురువారం జరిగిన శిఖరాగ్ర సమావేశంలో అన్నారు. రష్యాపై సమర్ధవంతంగా పోరాడేందుకు యాంటీ-ఎయిర్ మరియు యాంటీ-షిప్ ఆయుధాలు ఇవ్వాలంటూ జెలెన్స్కీ నాటో సభ్య దేశాలను అభ్యర్థించాడు. “భీకర యుద్ధ సమయంలో ఆయుధాలు లేకుండా మనుగడ సాధ్యమేనా?, సహాయం కోసం అభ్యర్థిస్తే ఇంతవరకు సమాధానం లేకపోవడం ఈ యుద్ధ సమయంలో అత్యంత దారుణ ఘటన” అని జెలెన్స్కీ అన్నారు.

Also read:Sundar Pichai: నిద్ర బదులు “నాన్-స్లీప్-డీప్-రెస్ట్” తీసుకుంటానంటున్న సుందర్ పిచై: అంటే ఏమిటి