Russia-Ukraine War : యుక్రెయిన్-రష్యా శాంతి చర్చల్లో వారిపై విష ప్రయోగం… నిజమేనంటున్న నివేదికలు..!

Russia-Ukraine War : యుక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఒకవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు ఇరుదేశాలు హోరాహోరీగా యుద్ధంలో తలపడుతున్నాయి.

Russia-Ukraine War : యుక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఒకవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు ఇరుదేశాలు హోరాహోరీగా యుద్ధంలో తలపడుతున్నాయి. యుక్రెయిన్ ఆక్రమణే లక్ష్యంగా పుతిన్ బలగాలు యుక్రెయిన్ లోకి దూసుకొస్తుంటే.. జెలెన్ స్కీ సైన్యం.. తమ దేశంలోకి ప్రవేశించిన రష్యా బలగాలను దీటుగా తిప్పికొడుతున్నాయి. రష్యా ఎన్నిక కవ్వింపు చర్యలకు పాల్పడిన యుక్రెయిన్ తలొగ్గలేదు. జెలెన్ స్కీ సైన్యం విరోచితంగా పోరాడుతూనే ఉంది. శాంతి చర్చలతో యుద్ధానికి ముగింపు పలకాలని మిత్ర దేశాలు ఇరుదేశాలను కోరుతున్నాయి.

ఇప్పటికే పలుమార్లు శాంతి చర్చలు జరిగినప్పటికీ ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఈ నేపథ్యంలో మరోసారి రెండు దేశాల మధ్య ఇస్తాంబుల్‌ వేదికగా శాంతి చర్చలు జరుగునున్నాయి. గతవారంలో యుక్రెయిన్, రష్యా యుద్ధానికి ముగింపు పలికేందుకు జరిపిన శాంతి చర్చల్లో పాల్గొన్న సభ్యులపై విష ప్రయోగం జరిగినట్టు బిల్లింగ్‌ క్యాట్‌, వాల్‌ స్ట్రీట్‌ జర్నల్ నివేదికలు వెల్లడించాయి. ఇరుదేశాల మధ్య చర్చల్లో పాల్గొన్న రష్యా బిలియనీర్‌ రోమన్‌ అబ్రమోవిచ్ (Roman Abramovich), యుక్రెయిన్‌కు చెందిన సంధానకర్తల (Ukrainian negotiators)పై విష ప్రయోగం జరిగినట్టు నివేదిక వెల్లడించిది. ఈ విష ప్రయోగానికి అబ్రమోవిచ్‌, యుక్రెయిన్‌కు చెందిన ఇద్దరు సీనియర్ సభ్యులు ప్రభావితమయ్యారని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ నివేదికలో పేర్కొంది.


రష్యా బిలియనీర్ రోమన్ అబ్రమోవిచ్ (Roman Abramovich), యుక్రేనియన్ శాంతి సంధానకర్తల మధ్య యుక్రెయిన్‌లోని కీవ్‌లో సమావేశం జరిగింది. దీని తర్వాత చర్చల్లో పాల్గొన్న వారిలో అనుమానాస్పద విషపు లక్షణాలు బయటపడినట్టు వాల్ స్ట్రీట్ జర్నల్, పరిశోధనాత్మక అవుట్‌లెట్ బెల్లింగ్‌క్యాట్ నివేదికలో వెల్లడించాయి. నివేదకల ప్రకారం.. విష ప్రయోగం జరిగిన తర్వాత అబ్రమోవిచ్‌, సంధానకర్తల చర్మంపై దద్దర్లు, కళ్ల మంటలు, కళ్లు ఎర్రబడటం, స్వల్ప అనారోగ్యానికి గురైనట్టు గుర్తించారు. విషప్రయోగానికి గురైన వారిద్దరూ ప్రస్తుతం కోలుకున్నారని, ఆరోగ్యం మెరుగుపడిందని నివేదిక వెల్లడించింది.

నెదర్లాండ్‌కు చెందిన బిల్లింగ్‌ క్యాట్‌ పరిశోధన సంస్థ ఈ ఘటనపై క్లారిటీ ఇచ్చింది. వారిపై కెమికల్‌ వెపన్‌తో విష ప్రయోగం జరిగినట్టు వెల్లడించింది. దాని మోతాదు తక్కువ ఉండటంతో ప్రమాదమేమీ జరగలేదని వెల్లడించింది. కేవలం వారిని బెదిరించేందుకే ఇలా విష ప్రయోగం జరిపినట్టు నివేదిక వెల్లడించింది. ఈ నివేదికలపై రష్యా ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ నివేదికను యుక్రేనియన్‌కు చెందిన శాంతి చర్చల సంధానకర్తలు సైతం తీవ్రంగా ఖండించారు.

యునైటెడ్ స్టేట్స్, EU సహా పాశ్చాత్య దేశాలు యుక్రెయిన్‌పై దాడి చేసినందుకు రష్యాపై కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. రష్యా బిలియనీర్లలో ఒలిగార్చ్‌లు పుతిన్‌తో దగ్గరి సంబంధాలు కలిగి ఉన్న ఇతర వ్యక్తులను ఆంక్షల జాబితాలో చేర్చారు. గత వారం వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించిన ప్రకారం.. మాస్కోతో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో రష్యన్ బిలియనీర్ అబ్రమోవిచ్‌ను పాత్ర పోషించవచ్చని తెలిపింది.

Read Also : Russia Soldiers Killed : రష్యాకు బిగ్ లాస్..! యుద్ధంలో 17వేల మందికి పైగా సైనికులు హతం-యుక్రెయిన్ ఆర్మీ

ట్రెండింగ్ వార్తలు