Russia Soldiers Killed : రష్యాకు బిగ్ లాస్..! యుద్ధంలో 17వేల మందికి పైగా సైనికులు హతం-యుక్రెయిన్ ఆర్మీ

రష్యా సేనల దూకుడును దీటుగా ప్రతిఘటిస్తూనే.. శత్రుదేశాన్ని దెబ్బకొడుతున్నట్టు వెల్లడించింది. ఇప్పటివరకు 17వేల మందికి పైగా సైనికులను..(Russia Soldiers Killed)

Russia Soldiers Killed : రష్యాకు బిగ్ లాస్..! యుద్ధంలో 17వేల మందికి పైగా సైనికులు హతం-యుక్రెయిన్ ఆర్మీ

Russian Soldiers Killed (2)

Russia Soldiers Killed : రష్యా-యుక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. నెల రోజులకు పైగా యుక్రెయిన్‌పై రష్యా సేనలు దాడులు చేస్తున్నాయి. యుక్రెయిన్ పై బాంబులు, మిస్సైళ్ల వర్షం కురిపిస్తున్నాయి. యుక్రెయిన్‌లో రష్యా సేనలు భారీ విధ్వంసమే సృష్టించాయి. ఈ దాడుల్లో యుక్రెయిన్ సైన్యంతో పాటు సాధారణ ప్రజలూ అనేకమంది చనిపోయారు. అయితే, ఎవరూ ఊహించని విధంగా యుక్రెయిన్ సేనల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. యుక్రెయిన్ బలగాలు రష్యా దాడులను ధీటుగా తిప్పికొడుతున్నాయి. ఈ యుద్ధంలో చాలామంది రష్యన్ సైనికులను హతమార్చినట్లు ఇప్పటికే పలుమార్లు ప్రకటనలు సైతం చేసింది యుక్రెయిన్ ఆర్మీ.

తాజాగా యుక్రెయిన్ ఆర్మీ కీలక ప్రకటన చేసింది. నాలుగు వారాలకుపైగా తమ దేశంలో రష్యా కొనసాగిస్తున్న దండయాత్రను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నట్టు తెలిపింది. రష్యా సేనల దూకుడును దీటుగా ప్రతిఘటిస్తూనే.. శత్రుదేశాన్ని దెబ్బకొడుతున్నట్టు వెల్లడించింది. ఇప్పటివరకు 17వేల మందికి పైగా రష్యా సైనికులను చంపినట్టు యుక్రెయిన్‌ ఆర్మీ వెల్లడించింది. అలాగే, 123 విమానాలు, 127 హెలికాప్టర్లతో పాటు 586 యుద్ధ ట్యాంకులు, 73 ఇంధన ట్యాంకులు, 1694 సాయుధ శకటాలతో పాటు భారీగా యుద్ధ సామగ్రిని ధ్వంసం చేసినట్టు తెలిపింది.(Russia Soldiers Killed)

Russian Generals : రష్యన్‌ జనరల్స్‌పై యుక్రెయిన్ బలగాల టార్గెట్..!

నెలరోజులుగా యుక్రెయిన్ పై రష్యా సేనలు భీకర దాడులు చేస్తున్నాయి. కొన్నిరోజులుగా దాడుల్లో తీవ్రత పెంచింది రష్యా. భారీ విధ్వంసం సృష్టించే ఆయుధాలను రష్యా సేనలు ఉపయోగిస్తున్నాయి. అయినా అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోతున్నారు పుతిన్.

యుద్ధం మొదలుపెట్టిన కొన్ని రోజుల్లోనే యుక్రెయిన్‌ రాజధానిని వశపర్చుకుని ప్రభుత్వాన్ని మార్చవచ్చని పుతిన్ భావించారు. కానీ, ఆ అంచనాలు ఏవీ నిజం కాలేదు. దాదాపు 4 వారాలకు పైగా భీకర యద్ధం కొనసాగుతోంది. అయితే, పుతిన్ ఊహించని విధంగా యుక్రెయిన్ సేనల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. యుక్రెయిన్ సేనలు తగ్గేదేలా అన్నట్టు పోరాటం సాగిస్తున్నాయి. అంతేకాదు, ఈ యుద్ధంలో రష్యాకు ఊహించని విధంగా నష్టం జరుగుతోంది. భారీ సంఖ్యలో తన సైనికులను కోల్పోతోంది రష్యా.

Russia Fires Agian Kalibr On Ukraine : యుక్రెయిన్‌పై రష్యా బలగాల భీకరదాడి.. మరోసారి కాలిబర్‌ మిస్సైల్ ప్రయోగం..

ఇది ఇలా ఉంటే.. ఉక్రెయిన్‌- రష్యా మధ్య భీకరంగా కొనసాగుతున్న యుద్ధం తమకు ఎక్కడ ముప్పు తెస్తుందోనని అమెరికన్లు వణికిపోతున్నారు. రష్యాపై కఠిన ఆంక్షలు విధిస్తూ అగ్రరాజ్యం తీసుకుంటున్న చర్యలతో పుతిన్‌ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని భయపడుతున్నారు. 90శాతం మంది అమెరికన్లు ఉక్రెయిన్‌పై రష్యా అణ్వస్త్రాలు ప్రయోగిస్తుందని విశ్వసిస్తుండగా.. 50శాతం మంది మాత్రం పుతిన్‌ తమపై కూడా అణ్వాయుధాలు వేస్తారని ఆందోళనలో ఉన్నట్టు సమాచారం.

Talks In Istanbul : ఇస్తాంబుల్‌ వేదికగా.. రేపు యుక్రెయిన్‌- రష్యా మధ్య శాంతి చర్చలు..!

యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు కీవ్‌ నగరంలో నలుగురు చిన్నారులు సహా 100 మందికి పైగా మృతిచెందినట్టు మేయర్‌ విటాలి క్లిట్స్కో తెలిపారు. 20కి పైగా మృతదేహాలను గుర్తించలేకపోయామని.. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారని తెలిపారు. అలాగే, గాయాలపాలైన 16 మంది చిన్నారులు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారని చెప్పారు.