Russian jet: అమెరికా ఎంక్యూ-9 డ్రోనును ఢీ కొట్టిన రష్యా యుద్ధ విమానం

నల్ల సముద్రంపై రష్యాకు చెందిన ఎస్యూ-27 యుద్ధ విమానం అమెరికా ఎంక్యూ-9 డ్రోనును ఢీ కొట్టింది. దీంతో తమ ఎంక్యూ-9 డ్రోను ధ్వంసమై, పడిపోయిందని అమెరికా వైమానిక దళం తెలిపింది. అంతర్జాతీయ గగనతలంపై తమ డ్రోను ద్వారా సాధారణ ఆపరేషన్లు నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని వివరించింది.

Russian jet: అమెరికా ఎంక్యూ-9 డ్రోనును ఢీ కొట్టిన రష్యా యుద్ధ విమానం

Russian jet

Updated On : March 15, 2023 / 8:43 AM IST

Russian jet: నల్ల సముద్రంపై రష్యాకు చెందిన ఎస్యూ-27 యుద్ధ విమానం అమెరికా ఎంక్యూ-9 డ్రోనును ఢీ కొట్టింది. దీంతో తమ ఎంక్యూ-9 డ్రోను ధ్వంసమై, పడిపోయిందని అమెరికా వైమానిక దళం తెలిపింది. అంతర్జాతీయ గగనతలంపై తమ డ్రోను ద్వారా సాధారణ ఆపరేషన్లు నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని వివరించింది.

దీంతో రష్యా అధికారులతో దీనిపై మాట్లాడామని, అంతర్జాతీయ గగనతలంపై తమ ఆపరేషన్లు కొనసాగుతాయని, సురక్షితమైన విధానాలు పాటించాలని చెప్పామని తెలిపారు. ఎంక్యూ-9 డ్రోను నల్ల సముద్ర గగనతలంపై ఉన్న సమయంలో దాని వద్దకు రెండు రష్యా ఎస్యూ-27 యుద్ధ విమానాలు నిర్లక్ష్యపూరితంగా వచ్చాయని చెప్పారు. రష్యా అసమర్థ, అసురక్షిత తీరు దీని వల్ల స్పష్టమవుతుందని అమెరికా వైమానిక దళ అధికారులు అన్నారు.

ఇటువంటి దురుసు చర్యలు ఉద్రిక్తతలకు దారి తీస్తాయని హెచ్చరించారు. కాగా, ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తున్న వేళ ఇటువంటి ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి నల్ల సముద్రంపై యుద్ధ విమానాలు తరుచూ చక్కర్లు కొడుతున్నాయి.

Pig Attacks Kid : షాకింగ్.. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై పంది దాడి, తీవ్ర గాయాలు.. వీడియో వైరల్