Russian Troops : రష్యా రాక్షసత్వం.. యుక్రెయిన్ మేయర్ కిడ్నాప్.. హింసించి దారుణహత్య..!
Russian Troops : యుక్రెయిన్‌లో రష్యా దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బుచాను శవాల దిబ్బగా మార్చేశారు. రష్యా చర్యలపై ప్రపంచదేశాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Russian Troops Tortured And Executed A Village Mayor And Her Family, Ukrainian Officials Say
Russian Troops : యుక్రెయిన్‌లో రష్యా దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బుచాను శవాల దిబ్బగా మార్చేశారు. రష్యా చర్యలపై ప్రపంచదేశాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా రష్యా సైన్యం మరో దారుణానికి పాల్పడింది. మార్చి 24న రష్యా దళాలు యుక్రెయిన్ మేయర్, ఆమె కుటుంబసభ్యులను కిడ్నాప్ చేశారు. ఇప్పుడు మేయర్ సహా కుటుంబ సభ్యులు దారుణ హత్యకు గురయ్యారు. కీవ్‌కు సమీపంలోని గ్రామంలో మేయర్ ఓల్గా సుఖెంకో, ఆమె భర్త, కుమారుడు సహా మరో ఇద్దరి మృతదేహాలు లభించాయి. అడవిలో మృతదేహాలు సగం వరకు పాతిపెట్టి ఉన్నాయి. చనిపోయిన వారి చేతులు వెనకకు కట్టేసి ఉన్నట్లు యుక్రెయిన్ అధికారులు గుర్తించారు.
మరోవైపు.. మైకోలివ్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి కూడా రష్యా బలగాలు బాంబుల మోతను మోగిస్తున్నాయి. ఆస్పత్రులు, జనావాసాలు అనే తేడాలేకుండా అన్నిచోట్లా బాంబులతో విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకూ యుక్రెయిన్‌లో 10మృతి చెందారు, మరో 46మంది గాయపడ్డారు. మొదటి దాడిలో ఒకరు మరణించగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. రెండో దాడిలో 9మంది మరణించగా.. 41 మంది గాయగపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. రష్యా సైన్యం దారుణాలపై యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. యుక్రెయిన్‌లో పౌరుల హత్యలు రష్యాతో చర్చలపై ప్రభావం పడుతుందని జెలెన్ స్కీ అన్నారు. రష్యా దురాగతాలపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జెలెన్ స్కీ గళం విప్పనున్నారు.

Russian Troops Tortured And Executed A Village Mayor And Her Family, Ukrainian Officials Say
యుక్రెయిన్‌లో మారణహోమానికి పాల్పడిన రష్యా… యుద్ధ నేరాలకు ముగింపు పలకాలని జెలెన్‌స్కీ డిమాండ్ చేశారు. జనావాసాలు, థియేటర్లు, పిల్లలు ఆశ్రయం పొందుతున్న ఆస్పత్రులపై రష్యా ఆర్మీ దాడి చేయడం యుద్ధ నేరాలుగా పరిగణించాలని జెలెన్‌స్కీ కోరారు. బుచాలో పర్యటించిన ఆయన అక్కడి దృశ్యాలు చూసి చలించిపోయారు. బుచాలో జరిగిన హత్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదంటోంది రష్యా.. ఆ దేశ పౌరులను లక్ష్యంగా దాడులు చేయలేదని బుచా వీధుల్లో ఉన్న మృతదేహాల విజువల్స్ నకిలీవని రష్యా గట్టిగా వాదిస్తోంది.
పుతిన్ యుద్ధ నేరగాడు : బైడెన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుద్ధ నేరగాడని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర ఆరోపణలు చేశారు. యుద్ధ నేరాలకు పాల్పడుతున్నాడనే అభియోగంపై పుతిన్‌పై వెంటనే విచారణ చేపట్టాలని ఆయన కోరారు. బుచ పట్టణంలో పౌరుల హత్యాకాండపై నిరసనల నేపథ్యంలో పుతిన్ బుచాలో ఎంతటి మారణహోమం సృష్టించారో మృతదేహాలను చూస్తే ప్రపంచానికి అర్థమవుతోందని అన్నారు. రష్యాపై మరిన్ని ఆంక్షలు త్వరలోనే విధిస్తామని బైడెన్ అన్నారు. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ప్రాసిక్యూషన్ దర్యాప్తునకు మద్దతిస్తామని యూరోపియన్ యూనియన్ తెలిపింది. మానవ హక్కుల కమిషన్ విచారణకు కూడా తమ సపోర్ట్ ఉంటుందని వెల్లడించింది. పాశ్చాత్య దేశాలు కూడా రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాలని ప్రపంచదేశాలకు పిలుపునిచ్చాయి. గ్రీస్, ఫ్రాన్స్ కూడా రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తామని చెప్పాయి. బ్రిటన్, జర్మనీ బుచా దృశ్యాలపై చాలా సీరియస్‌గా స్పందించాయి.
Read Also : Russia-ukraine war : యుక్రెయిన్‌లో కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యం..చనిపోయిన యజమాని వద్దనుంచి కదలని కుక్క