Saudi Arabia : మదీనాలో భారీ ఎత్తున బంగారం, రాగి నిక్షేపాలను కనుగొన్న సౌదీ అరేబియా
సౌదీ అరేబియాలో భారీ ఎత్తున బంగారం, రాగి నిక్షేపాలు బయటపడ్డాయని సౌదీ అరేబియా ప్రకటించింది. ముస్లింలకు పుణ్యక్షేత్రమైన మదీనాలో అపారమైన బంగారం, రాగి ఖనిజాలు ఉన్నట్టు గుర్తించామని సౌదీ అరేబియా ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది.

Saudi Arabia Announces Discovery Of Huge Gold And Copper
Saudi Arabia : సౌదీ అరేబియా అంటే నిధి నిక్షేపాలకు ప్రసిద్ధి. అక్కడ పెద్ద ఎత్తున బంగారు నిక్షేపాలున్నాయని అంటుంటారు. ఇది కేవలం అంచనా మాత్రమే కాదు నిజమేనంటోంది సౌదీ అరేబియా. సౌదీ అరేబియాలో భారీ ఎత్తున బంగారం, రాగి నిక్షేపాలు బయటపడ్డాయని సౌదీ ప్రకటించింది. ముస్లింలకు పుణ్యక్షేత్రమైన మదీనాలో అపారమైన బంగారం, రాగి ఖనిజాలు ఉన్నట్టు గుర్తించామని సౌదీ అరేబియా ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది.
సౌదీ అరేబియాకు పశ్చిమాన గల మదీనా ప్రాంతంలోని అబా అల్ రహా వద్ద బంగారం నిక్షేపాలు ఉన్నాయని సౌదీ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అల్ మదీక్ ప్రాంతంలో నాలుగు చోట్ల రాగి ఖనిజం ఉన్నట్టుగా గుర్తించామని వెల్లడించింది. తాజా ఆవిష్కరణల ద్వారా భవిష్యత్ పెట్టుబడుల దిశగా మరిన్ని అవకాశాలకు ద్వారాలు తెరుస్తున్నామని సౌదీ జియోలాజికల్ సర్వే పేర్కొంది.
తాజాగా గుర్తించిన ఈ నిథి నిక్షేపాల ద్వారా సౌదీకి 533 మిలియన్ డాలర్ల పెట్టుబడి వచ్చే అవకాశం ఉందని..తద్వారా 4 వేల ఉద్యోగాలు కూడా లభిస్తాయని స్థానిక మీడియా ప్రసారం చేసింది. సౌదీ అబిరేయాలో 5,300 ప్రాంతాల్లో ఖనిజ లవణాలు లభ్యమవుతాయని సౌదీ జియాలజిస్ట్స్ కోఆపరేటివ్ అసోసియేషన్ చైర్మన్ అబ్దులజీజ్ బిన్ లబాన్ గతంలో తెలిపారు. వీటిలో విభిన్నమైన మెటల్, నాన్-మెటల్ శిలలు, నిర్మాణ వస్తువులు, అలంకరణ శిలలు, రత్నాలు ఉన్నాయి.
క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ స్థాపించిన విజన్ 2030 గోడ్‌లో భాగంగా విస్తరణ కోసం గుర్తించబడిన రంగాలలో మైనింగ్ ఒకటి. అల్ అరేబియా ప్రకారం..జూన్‌లో, క్రౌన్ ప్రిన్స్ పరిశోధన మరియు అభివృద్ధి రంగానికి జాతీయ ప్రాధాన్యతలను ప్రకటించారు. మేలో, రాజ్యం పరిశ్రమ,ఖనిజ వనరుల మంత్రిత్వ శాఖ మైనింగ్ రంగంలోకి $32 బిలియన్ల పెట్టుబడులను ఆకర్షించే ప్రణాళికలను వివరించింది.