అప్పుచ్చినోళ్లకి గిఫ్ట్ : సౌదీ రాజుకు బంగారు రైఫిల్

విదేశీ అతిథులు పర్యటనలకు వస్తే బహుమతులు ఇవ్వడం సహజమే. శాలువాలతో సన్మానం, జ్ణాపికలు ఇస్తుంటాం. కొంచెం పెద్దోళ్లు అయితే బంగారం, వెండి బహుమతులు ఇస్తుంటారు. ఆ వ్యక్తి స్థాయికి తగ్గట్టు అవి ఉంటాయి. అదే ఓ రాజు అతిథిగా వస్తే.. ఎలాంటి గిఫ్ట్ తో సత్కరిస్తాం అనేది ఆయా వ్యక్తుల హోదాకు తగ్గట్టు ఉంటుంది. అదే రాజు.. మరో దేశానికి అతిథిగా వెళితే మాత్రం.. ఆ బహుమానం రేంజ్ మారిపోతుంది. నిన్నటికి నిన్న సౌదీ రాజు పాకిస్తాన్ లో పర్యటించారు. ఆయనకు ఆ దేశం ఘనమైన బహుమతి సమర్పించింది. అదేంటో తెలుసా..? తెలిస్తే షాక్ అవుతారు.
మింగడానికి మెతుకు లేదు గాని మీసాలకు సంపెంగ నూనె అన్నట్లు ఉంది పాకిస్తాన్ వ్యవహారం. అసలే ఆర్థిక పరిస్థితులు బాగాలేక విదేశాల సహాయం కోరుతున్న పాకిస్తాన్…. తమ దేశంలో పర్యటించిన సౌదీరాజు మొహ్మద్ బిన్ సల్మాన్‌కు బంగారు పూత కలిగిన తుపాకీని బహుకరించింది. సౌదీరాజు అక్కడే రెండ్రోజుల పాటు పర్యటించి పాక్ కు అనేక రకాల సాయం చేసారు. వాటిలో అన్నిటికంటే ముఖ్యంగా రూ.14 వేల కోట్ల పెట్టుబడులకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించడం పాకిస్థాన్ కు ఇటీవల కాలంలో అతిపెద్ద ఊరట అని చెప్పాలి. ఒక్కసారిగా వేల కోట్ల సాయం అప్పనంగా అందేసరికి పాక్ ఆనందం పరవళ్లు తొక్కింది.
మొట్టమొదటిసారి పాకిస్థాన్ పర్యటనకు వచ్చిన సౌదీరాజుకు లభించిన కానుక చూసి అయన ఆశ్చర్యపోయారు. ఈ పర్యటనలో సౌదీ యువరాజును ఆకట్టుకునేందుకు పాక్ చేయని ప్రయత్నమంటూ లేదు. రుచికరమైన వంటకాలను పరిచయం చేయడంతో పాటు అపురూపమైన కానుకలు అందించడం వరకు ప్రతి విషయంలో తపించిపోయింది.
Read Also: సినిమా రివ్యూ : ఎన్టీఆర్ మహానాయకుడు
Read Also: ఒక్కో అమరవీరుడి కుటుంబానికి రూ.25లక్షల సాయం : సీఎం కేసీఆర్
Read Also: బడ్జెట్ ప్రవేశ పెట్టిన కేసీఆర్