పనిలేక డబ్బుల్లేవ్.. తినడానికి తిండి లేక.. అక్కడ వ్యభిచారిణుల పరిస్థితి ఇది

కారోనా వైరస్ కారణంగా ప్రపంచమే లాక్ డౌన్ అయిన పరిస్థితి. పలు దేశాల్లో ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. ఇప్పటికే ఆ వైరస్ దెబ్బకు వేల మంది చనిపోగా.. లక్షల మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్ ప్రతి రంగం కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ క్రమంలోనే రోజువారి కూలీలు తిండిలేక అల్లాడుతున్న పరిస్థితి.
పనిచేస్తే కానీ, పూట గడవని పరిస్థితుల్లో.. ఇన్నాళ్లు కడుపు నిండా తిన్న వాళ్లు కూడా ఆకలితో అలమటిస్తున్నారు. చేతిలో చిల్లి గవ్వ లేక, తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే పడుపు వృత్తి చేసుకుని పూట గడుపుకునే సెక్స్ వర్కర్లు సైతం తిండికి లేక అవస్థలు పడుతున్నారు.
థాయిలాండ్‌లో లీగల్ అయిన వ్యభిచారం.. వ్యభిచారిణుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. దాదాపు 3 లక్షల మంది వ్యభిచారిణులు రోడ్డున పడిపోయారు. బ్యాంకాక్, పట్టయా ప్రాంతాల్లో పడుపు వృత్తి చేసుకుంటూ జీవిస్తున్న వాళ్లు ఇప్పుడు కరోనా దెబ్బకు రోడ్డు మీదకు రావట్లేదు. అక్కడి ప్రభుత్వాలు రానివ్వట్లేదు. బ్యాంకాక్‌లో ఉండే సెక్స్ వర్కర్లు బార్లలో టిప్స్ కోసం పనిచేసేవాళ్లు.
బ్యాంకాక్ నుండి పట్టాయా వరకు రెడ్ లైట్ ఏరియాలు.. నైట్ క్లబ్‌లు, మసాజ్ పార్లర్‌లను మూసివేయడంతో పాటు పర్యాటకులు దేశంలోకి ప్రవేశించకుండా నిబంధనలు విధించారు. ఈ క్రమంలో ట్రాన్స్ జెండర్లు, సెక్స్ వర్కర్లకు రోజు గడిచే పరిస్థితి లేదట. ప్రస్తుతం థాయిలాండ్‌లో 2వేల మందికి వైరస్ సోకగా, 20 మంది చనిపోయారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకొనేందుకు 24 గంటల కర్ఫ్యూ పెట్టేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది.
ఈ క్రమంలోనే సెక్స్ వర్కర్లు అందరూ కలిసి “తమ ఆదాయాన్ని కోల్పోయిన కార్మికులందరికీ సహాయం అందించడానికి ఒక మార్గాన్ని కనుగొనాలంటూ” ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు.
Also Read | లాక్ డౌన్ లోనూ పక్కా స్కెచ్, అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపించిన భార్య