Seoul Halloween Stampede : తీవ్ర విషాదం.. హాలోవీన్ వేడుకల్లో తొక్కిసలాట, 59మందికి గుండెపోటు

దక్షిణ కొరియాలో హాలోవీన్ వేడుకల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ వేడుకల్లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 59 మంది గుండెపోటుతో మరణించారు.

Seoul Halloween Stampede : దక్షిణ కొరియాలో హాలోవీన్ వేడుకల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ వేడుకల్లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 59 మంది గుండెపోటుతో మరణించారు. రాజధాని సియోల్ లోని ఓ ఇరుకు వీధిలోకి ఒక్కసారిగా ప్రజల గుంపు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 150 మందికిపైగా గాయపడ్డారు.

ఇరుకు వీధిలోకి పెద్ద సంఖ్యలో జనాలు రావడంతో తొక్కిసలాట జరిగింది. దాదాపుగా 59 మందికి గుండెపోటు సంభవించినట్లు సమాచారం. ఇటావాన్ లీజర్ డిస్ట్రిక్ట్ లో శనివారం ఈ ఘటన జరిగింది. చాలామంది ప్రజలు కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

సియోల్ లోని హామిల్టర్ హోటల్ సమీపంలో ఇరుకైన సందులో ఒకేసారి గుంపులుగా ప్రజలు రావడంతో ఈ ఘటన జరిగింది. చాలామందికి తొక్కిసలాటలో శ్వాస ఆడకపోవడంతో వైద్య సిబ్బంది సీపీఆర్ నిర్వహించారు. గాయపడిన వారిని సమీపంలో ఉన్న ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారికి తక్షణమే చికిత్స అందించాలని, భద్రతను సమీక్షించాలని దక్షిణ కొరియా అధ్యక్షుడు అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు

చికిత్స అందించేందుకు సమీపంలోని అన్ని ఆస్పత్రుల్లో వైద్య బృందాలను, బెడ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. హాలోవీన్ ఉత్సవాల సందర్భంగా దాదాపుగా లక్ష మంది ప్రజలు ఇటావాన్ వీధుల్లోకి చేరుకున్నారని అక్కడి మీడియా నివేదించింది. కాగా, ఇటీవలే సౌత్ కొరియాలో కరోనా నిబంధనలు సడలించారు. దీంతో హాలోవీన్ ఉత్సవాలు భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు.

తొక్కిసలాట నేపథ్యంలో వెంటనే అలర్ట్ అయిన అధికారులు గాయపడిన వారికి వైద్య చికిత్స అందించేందుకు 400 మంది అత్యవసర సిబ్బందిని రంగంలోకి దింపారు. 140 వాహనాలను సిద్ధం చేశారు.