Miss Universe 2023 : మిస్ యూనివర్స్ 2023గా నికరాగ్వా సుందరి షెన్నిస్ పలాసియోస్

మిస్ యూనివర్శ్ 2023 కిరీటాన్ని నికరాగ్వా అందాల భామ షెన్నిస్ పలాసియోస్ కైవసం చేసుకుంది. థాయ్‌లాండ్‌కు చెందిన సుందరి ఆంటోనియా పోర్సిల్డ్ రన్నరప్‌గా నిలవగా, ఆస్ట్రేలియాకు చెందిన మోరయా విల్సన్ రెండో రన్నరప్‌గా ఎంపికయ్యారు....

Miss Universe 2023 : మిస్ యూనివర్స్ 2023గా నికరాగ్వా సుందరి షెన్నిస్ పలాసియోస్

Miss Universe Sheynnis Palacios

Miss Universe 2023 : మిస్ యూనివర్శ్ 2023 కిరీటాన్ని నికరాగ్వా అందాల భామ షెన్నిస్ పలాసియోస్ కైవసం చేసుకుంది. థాయ్‌లాండ్‌కు చెందిన సుందరి ఆంటోనియా పోర్సిల్డ్ రన్నరప్‌గా నిలవగా, ఆస్ట్రేలియాకు చెందిన మోరయా విల్సన్ రెండో రన్నరప్‌గా ఎంపికయ్యారు. మిస్ నికరాగ్వా అయిన షెన్నిస్ పలాసియోస్ మిస్ యూనివర్స్ కిరీటాన్ని కూడా దక్కించుకున్నారు.

ఆకట్టుకున్న అందాల భామలు

అందం, కరుణ, తెలివితేటలతో అబ్బురపరిచే ప్రదర్శనలో నికరాగ్వాకు చెందిన షెన్నిస్ పలాసియోస్ మిస్ యూనివర్స్ 2023 కిరీటాన్ని దక్కించుకోవడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీక్షకులను ఆకర్షించింది. శాన్ సాల్వడార్‌లోని జోస్ అడాల్ఫో పినెడా అరేనాలో నిర్వహించిన ఈ అందాల పోటీల్లో 84 సుందరీమణులు పోటీ పడ్డారు.

ALSO READ : Barrelakka Sirisha : కొల్లాపూర్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న బర్రెలక్క

మెరిసే వేదికపై జరిగిన ఈ ఈవెంట్ వివిధ దేశాలకు చెందిన సుందరాంగులు తమ అందచందాలను ప్రదర్శించారు. షెన్నిస్ పలాసియోస్ తన అద్భుతమైన రూపంతోపాటు ఆమె విలక్షణ వ్యక్తిత్వం, సానుకూల దృక్పథం పట్ల నిబద్ధత ప్రత్యేకత నిలిపింది.

ALSO READ : ICC World Cup 2023 : ఐసీసీ ప్రపంచ కప్ విజేతకు కనకవర్షమే

మిస్ యూనివర్స్ గెలుచుకున్న మొదటి నికరాగ్వా మహిళ అయిన షెన్నిస్ పలాసియోస్ ఈ పోటీ కోసం ధరించిన గౌనులో మెరిసిపోయారు.మిస్ యూనివర్స్ 2023 పట్టాభిషేకం నికరాగ్వాకు ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలచింది.