Barrelakka Sirisha : కొల్లాపూర్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న బర్రెలక్క

నిరుద్యోగుల ప్రతినిధిగా ఎన్నికల బరిలోకి దిగిన బర్రెలక్క అలియాస్ శిరీషా ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎన్ని డిగ్రీలు చదివినా ప్రభుత్వ ఉద్యోగాలు రావడం లేదని అందుకే బర్లు కాసుకుంటున్నానని తీసిన వీడియోతో నిరుద్యోగి శిరీషా తెలంగాణ వార్తల్లోకి ఎక్కింది....

Barrelakka Sirisha : కొల్లాపూర్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న బర్రెలక్క

Barrelakka Sirisha

Barrelakka Sirisha : నిరుద్యోగుల ప్రతినిధిగా ఎన్నికల బరిలోకి దిగిన బర్రెలక్క అలియాస్ శిరీషా ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎన్ని డిగ్రీలు చదివినా ప్రభుత్వ ఉద్యోగాలు రావడం లేదని అందుకే బర్లు కాసుకుంటున్నానని తీసిన వీడియోతో నిరుద్యోగి శిరీషా తెలంగాణ వార్తల్లోకి ఎక్కింది. బర్లు కాసుకుంటున్న వీడియోతో బర్రెలక్కగా పేరొందిన శిరీషా అనూహ్యంగా నిరుద్యోగుల ప్రతినిధిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోంంది.

విజిల్ వేస్తున్న బర్రెలక్క

నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మరికల్‌ గ్రామానికి చెందిన శిరీష కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేస్తున్న బర్రెలక్కకు విద్యార్థి సంఘాల నేతలు, నిరుద్యోగులు మద్ధతు పలికారు. శిరీషాకు కేంద్ర ఎన్నికల సంఘం విజిల్ గుర్తు కేటాయించడంతో విజిల్ వేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. సోషల్ మీడియాలో బర్రెలక్క ఎన్నికల ప్రచారానికి అనూహ్య స్పందన వస్తోంది.

నిరుద్యోగుల గొంతుక బర్రెలక్క…

నిరుద్యోగుల గొంతుక అయిన బర్రెలక్క తన ప్రచారంలో భాగంగా యూట్యూబ్ లో ఓ పాటను విడుదల చేసింది. ‘‘కదిలే ఓ అడుగు…యువతకు నువ్వు వెలుగు…కదిలింది మన బర్రెలక్క అదిగో లేవర యువత’’అంటూ సాగుతున్న పాట సోషల్ మీడియా, యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ధైర్యంగా బరిలో నిలిచిన బర్రెలక్కకు మనం మద్ధతుగా నిలుద్దాం అంటూ నిరుద్యోగులు ముందుకు వచ్చారు.

బర్రెలక్కకు రూ.లక్ష సాయం

నామినేషన్ విత్ డ్రా చేసుకోకపోతే తనను చంపేస్తామని కొందరు భయపెట్టారని, కానీ తాను ధైర్యంగా బరిలో నిలిచానని బర్రెలక్క అలియాస్ శిరీషా చెబుతోంది. వినూత్న ఎన్నికల ప్రచారంతో దూసుకుపోతున్న బర్రెలక్కకు తానున్నానంటూ యానాం మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు లక్ష రూపాయల విరాళం పంపించారు.

ALSO READ : ICC World Cup 2023 : ఐసీసీ ప్రపంచ కప్ విజేతకు కనకవర్షమే

నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన నిరుద్యోగి శిరీషా తనకు ఒక్కసారి ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని, భవిష్యత్ ను మారుస్తానని చెబుతూ ప్రచార హోరు సాగిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నిరుద్యోగిని బర్రెలక్క(శిరీష) రాష్ట్ర రాజకీయాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘‘బానిస లాంటి బతుకు వదులుకో.. కదలిరారా యువత.. పేదబిడ్డ మన బర్రెలక్కకు ఓటు వేద్దమన్న… దొరల పాలన దోపిడి రాజ్యం’’ అంటూ ఎన్నికల ప్రచార సాంగ్ తో ఓటర్ల ముందుకు వెళుతోంది.

ALSO READ : India vs Australia Cricket World Cup Final : భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌కు భారీ భద్రత

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క ఎన్నికల ప్రచారం ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. మరి నిరుద్యోగుల గొంతుకగా నిలిచిన బర్రెలక్క అసెంబ్లీకి వెళుతుందా లేదా అనేది డిసెంబర్ 3వతేదీ ఓట్ల లెక్కింపు వరకు వేచి చూడాల్సిందే.