India vs Australia Cricket World Cup Final : భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌కు భారీ భద్రత
భారత్ -ఆస్ట్రేలియా క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం అహ్మదాబాద్ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో ఉన్న నరేంద్రమోదీ స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం జరగనున్న ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అహ్మదాబాద్ పోలీసులు ఆరు వేల మంది పోలీసులతో భద్రత కల్పించారు....

Security Personnel
India vs Australia Cricket World Cup Final : భారత్ -ఆస్ట్రేలియా క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం అహ్మదాబాద్ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో ఉన్న నరేంద్రమోదీ స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం జరగనున్న ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అహ్మదాబాద్ పోలీసులు ఆరు వేల మంది పోలీసులతో భద్రత కల్పించారు.
గ్రాండ్ ఫినాలేకు మోదీ, రిచర్డ్ మార్లెస్
ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ గ్రాండ్ ఫినాలేకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రధానమంత్రి రిచర్డ్ మార్లెస్ హాజరుకానుండటంతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశామని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జిఎస్ మాలిక్ తెలిపారు. అహ్మదాబాద్ నగరంలో మ్యాచ్ కు లక్షమంది ప్రేక్షకులతోపాటు పలువురు ప్రముఖులు హాజరుకానుండటంతో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, గుజరాత్ పోలీసులతో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశామని మాలిక్ చెప్పారు.
క్రికెట్ గ్రౌండులో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్
క్రికెట్ మైదానంలో 3వేలమందిని మోహరించారు. క్రికెట్ క్రీడాకారులున్న హోటళ్లు, వీవీఐపీలు బస చేసిన అతిథి గృహాల వద్ద మరో 3వేలమందిని బందోబస్తుగా నియమించారు. క్రికెట్ గ్రౌండులో తాత్కాలిక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం వైర్‌లెస్ నెట్‌వర్క్‌తో మొబైల్ కమ్యూనికేషన్‌తో కూడా పనిచేస్తుంది.
బాంబ్ డిటెక్షన్, డిస్పోజల్ స్క్వాడ్
నలుగురు ఐజీ.డీఐజీ ర్యాంకుకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారులు,39 మంది అసిస్టెంట్ పోలీసు కమిషనర్లు, 92 మంది పోలీసు ఇన్‌స్పెక్టర్లు బందోబస్తు విధుల్లో ఉంటారు. మ్యాచ్‌లో ఏదైనా రసాయన, జీవ, రేడియోలాజికల్, న్యూక్లియర్ అత్యవసర పరిస్థితులపై స్పందించడానికి జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం బృందాలను కూడా నగరంలో మోహరించారు.
ALSO READ : Delhi : వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ రోజున మద్యం షాపులు బంద్..ఎక్కడంటే?
బాంబ్ డిటెక్షన్, డిస్పోజల్ స్క్వాడ్‌కు చెందిన 10 బృందాలతో పాటు రెండు బృందాల చేతక్ కమాండోస్, ఒక ఎలైట్ యూనిట్‌ను స్టేడియం సమీపంలో ఉంచనున్నట్లు పోలీసులు తెలిపారు. భారతదేశం వెలుపల కూర్చున్న వ్యక్తులు జారీ చేసే బెదిరింపులను తాము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని డీజీపీ మాలిక్ చెప్పారు.
ఈ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి, సింగపూర్ హోం వ్యవహారాల మంత్రి కె. షణ్ముగం, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్, అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా తదితరులు హాజరు కానున్నారు. 1.32 లక్షల సామర్థ్యం గల స్టేడియంలో మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. భారత వైమానిక దళానికి చెందిన ప్రఖ్యాత సూర్య కిరణ్ ఏరోబాటిక్స్ బృందం ఆదివారం ఆటకు ముందు ఎయిర్ షోను నిర్వహించనుంది.