Passenger Tied To Seat : ఎగురుతున్న విమానంలో షాకింగ్ ఘటన.. ప్యాసింజర్‌ను కట్టేసి..
ఓ రన్నింగ్ విమానంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్యాసింజర్ ను విమాన సిబ్బంది టేప్ తో సీటుకి కట్టేశారు. అతడి నోటికి కూడా టేప్ వేశారు. తోటి ప్రయాణికుల సాయంతో సిబ్బంది ఈ పని చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే..

Passenger Tied To Seat
Passenger Tied To Seat : ఓ రన్నింగ్ విమానంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్యాసింజర్ ను విమాన సిబ్బంది టేప్ తో సీటుకి కట్టేశారు. అతడి నోటికి కూడా టేప్ వేశారు. తోటి ప్రయాణికుల సాయంతో సిబ్బంది ఈ పని చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే..
అతడి పేరు మ్యాక్స్ వెల్ బెర్రీ. వయసు 22ఏళ్లు. ఓహియో నివాసి. ఫిలడెల్ఫియా నుంచి మియామీ వెళ్లే ప్లేన్ ఎక్కాడు. కాగా, అతడు తాగి ఉన్నాడు. మద్యం మత్తులో ప్లేన్ లో రచ్చ రచ్చ చేశాడు. ఫ్లైట్ సిబ్బందిని ఇబ్బంది పెట్టాడు. అకారణంగా వారితో గొడవపడ్డాడు. అంతేకాదు తోటి ప్రయాణికులతోనూ వాగ్వాదానికి దిగాడు. చేయి కూడా చేసుకున్నాడు. సైలెంట్ గా కూర్చోవాలని విజ్ఞప్తి చేసినా అతడు వినిపించుకోలేదు.
మ్యాక్స్ వెల్ ప్రవర్తనతో విసిగిపోయిన సిబ్బంది.. తోటి ప్రయాణికుల సాయంతో అతడిని సీటుకి కట్టేశారు. బలమైన్ టేప్ తో అతడిని సీటుకి బంధించారు. నోటికి కూడా టేప్ వేశారు. దీంతో మ్యాక్స్ వెల్ బిత్తరపోయాడు. నన్ను వదిలేయండి అని వేడుకున్నాడు. హెల్ప్ మీ అంటూ కేకలు వేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి సంబంధించి విమాన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసిన దర్యాఫ్తు చేపట్టారు. నా తల్లిదండ్రులు డబ్బున్న వాళ్లు, నన్ను ఏమీ చేయలేరు అంటూ మ్యాక్స్ వెల్ కేకలు వేశాడు.