Delta Airlines(Photo : Google)
Delta Airlines : అమెరికా డెల్టా ఎయిర్ లైన్స్ లో ఓ ప్రయాణికుడు రెచ్చిపోయాడు. పీకల దాకా తాగిన వృద్ధుడు మద్యం మత్తులో బరితెగించాడు. వైన్ సర్వ్ చేసేందుకు వచ్చిన అటెండెంట్ ని గట్టిగా పట్టుకుని బలవంతంగా ముద్దు పెట్టాడు. అమెరికా డెల్టా ఎయిర్ లైన్స్ లో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆ వృద్ధుడి పేరు డేవిడ్ అలన్ బర్క్. వయసు 61ఏళ్లు. అలాస్కా వెళ్లేందుకు ఫ్లైట్ ఎక్కాడు.
ఫ్లైట్ టేకాఫ్ కాకముందే తనకు ఆల్కహాల్ సర్వ్ చేయాలని సిబ్బందిని కోరాడు బర్క్. అయితే, ఫ్లైట్ రూల్స్ అండ్ రెగులేషన్స్ ప్రకారం.. క్రూ సిబ్బంది.. అతడికి డ్రింక్స్ సర్వ్ చేయలేదు. ఇది బర్క్ కు తీవ్రమైన కోపం తెప్పించింది.(Delta Airlines)
కాసేపటి తర్వాత ఫ్లైట్ గాల్లోకి ఎగిరింది. దాంతో సిబ్బంది.. ప్రయాణికులకు సర్వ్ చేయడం ప్రారంభించారు. అదే సమయంలో తనకు మందు సర్వ్ చేసేందుకు నిరాకరించిన అటెండెంట్.. మళ్లీ అతడికి దగ్గరికి వచ్చాడు. మందు సర్వ్ చేయడం స్టార్ట్ చేశాడు. బర్క్ పీకల దాకా తాగేశాడు. కిక్కు బాగా ఎక్కేసింది.
మద్యం మత్తులో ఉన్న బర్క్.. అటెండెంట్ తో అనుచితంగా ప్రవర్తించాడు. మగాడు అని కూడా చూడకుండా అతడిని కిస్ అడిగాడు. వృద్ధుడి కోరికతో అతడు బిత్తరపోయాడు. ఒక మగాడు మరో మగాడిని కిస్ అడగటం ఏంటని నివ్వెరపోయాడు. ముద్దు ఇచ్చేందుకు నిరాకరించాడు. దాంతో బర్క్ రెచ్చిపోయాడు. అటెండెంట్ ను గట్టిగా పట్టుకున్నాడు. బలవంతంగా అతడి మెడపై ముద్దు పెట్టాడు. అంతేకాదు ఆహారం ఉన్న ప్లేట్ ను విరగ్గొట్టాడు. దాంతో ఆ అటెండెంట్ షాక్ కి గురయ్యాడు. వృద్ధుడి విపరీత చర్యతో ఇబ్బందిపడ్డాడు.(Delta Airlines)
ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత బాధితుడు ఎయిర్ పోర్టు అధికారులకు వృద్ధుడిపై ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు బర్క్ పై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాఫ్తు చేపట్టారు. కాగా, తనపై చేసిన ఆరోపణలను బర్క్ ఖండించాడు. తాను ముద్దు పెట్టలేదన్నాడు. అసలు మద్యం మత్తులోనే లేనని
చెప్పాడు. కాగా, దాడి, నేరపూరిత దుష్ప్రవర్తన ఆరోపణలపై ఏప్రిల్ 27న కోర్టులో విచారణకు హాజరుకావాలని బర్క్ ని ఆదేశించారు.(Delta Airlines)
Also Read.. Viral Video: కెమికల్స్‌లో ముంచిన కూరగాయలు.. తర్వాత ఏమైందో తెలిస్తే షాక్