Viral Video: కెమికల్స్‌లో ముంచిన కూరగాయలు.. తర్వాత ఏమైందో తెలిస్తే షాక్
తాజాగా కూరగాయలకు సంబంధించిన ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ తీసిందో తెలియనప్పటికీ.. అమిత్ తడాని అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రకారం.. వాడిపోయిన ఆకు కూరల్ని ఒక వ్యక్తి కెమికల్ కలిపిన నీటిలో ముంచి, బయటకు తీశాడు.

Viral Video: మార్కెట్లో దొరికే కూరగాయలు, పండ్లలో ఏవి నాణ్యమైనవో.. ఏవి కల్తీవో తేల్చడం చాలా కష్టం. అంతలా మోసాలు జరుగుతున్నాయి. ఎక్కువగా కెమికల్స్ కలిపిన ఐటమ్సే మార్కెట్లో దొరుకుతున్నాయి. తాజాగా కూరగాయలకు సంబంధించిన ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Rafael Nadal: టాప్-10లో చోటు కోల్పోయిన రఫెల్ నాదల్.. 2005 తర్వాత ఇదే తొలిసారి
ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ తీసిందో తెలియనప్పటికీ.. అమిత్ తడాని అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రకారం.. వాడిపోయిన ఆకు కూరల్ని ఒక వ్యక్తి కెమికల్ కలిపిన నీటిలో ముంచి, బయటకు తీశాడు. ఆ ఆకు కూరల్ని కొద్దిసేపు పక్కన పెట్టాడు. ముందుగా ఎండిపోయినట్లున్న ఆకు కూరలు.. కెమికల్లో ముంచిన కొద్ది సేపటి తర్వాత తాజాగా మారడం మొదలైంది. కొద్ది క్షణాల్లోనే ఆకు కూరలు తాజా వాటిలా తయారయ్యాయి. ఆకు కూరల్ని ఎవరైనా చూస్తే అప్పుడే పొలం నుంచి తెచ్చినట్లుగా, తాజాగా కనిపిస్తున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు.
బయట దొరికే కూరగాయలు, పండ్లు నిజంగానే తాజావా.. లేక అన్నీ ఇలా కెమికల్స్‌తో ఫ్రెష్‌గా కనిపించేలా తయారు చేసినవా అని నెటిజన్స్ అనుమానపడుతున్నారు. అయితే, ఇది చాలా పాత వీడియో అని తెలుస్తోంది. ఏదేమైనా ఇలాంటి కెమికల్స్ వాడిన కూరగాయల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ షాకింగ్ వీడియోను మీరూ ఓసారి చూసేయండి.
A two minute real life horror story. 😱 pic.twitter.com/gngzaTT56q
— Amit Thadhani (@amitsurg) March 17, 2023