ఆ మొసలి ఆకలితో అలమటిస్తోంది. తినడానికి ఆహారం దొరక్క అల్లాడిపోతోంది. ఇంతలో ఓ పెద్ద చేప కనిపించింది. అంతే.. ఒక్కసారిగా నీటి కొలనులో నుంచి బయటకు వచ్చి గాలానికి చిక్కిన చేపను అమాంతం మింగేసింది. ఈ ఘటన ఆస్ట్రేలియా నార్తరన్ భూభాగంలోని కక్కడు నేషనల్ పార్కులో జరిగింది. చేపలు పట్టేవాళ్లు వేసిన గాలానికి ఓ పెద్ద చేప చిక్కింది.
ఆ చేపను పట్టుకున్న సంతోషంలో వారిద్దరూ వెళ్తుండగా ఆకస్మాత్తుగా నీటిలో నుంచి మొసలి బయటకు వచ్చింది. మొసలిని చూసిన భయంతో వారు అక్కడి నుంచి పరిగెత్తారు. గాలానికి చిక్కిన పెద్ద చేప కింద పడిపోయింది. ఆకలితో ఉన్న ఆ మొసలి వెంటనే చేపను మింగేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోకు ఇప్పటివరకూ 12వేల రియాక్షన్లు రాగా.. 7వేలకు పైగా కామెంట్లు వచ్చాయి. వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో పోస్టులు పెడుతున్నారు. ఆస్ట్రేలియాలో కాహిల్స్ క్రాసింగ్ మొసళ్లకు పుట్టనిల్లు. ఉప్పునీటిలో నివసించే మొసళ్లు దేశంలోనే ఎంతో భయంకరమైనవిగా చెబుతుంటారు. చేపను వేటాడి మొసలి మింగేస్తున్న వీడియో ఇదే…