ధూమపానం.. ఆరోగ్యానికి హానికరం.. ఇలాంటి క్యాషన్స్ సిగరేట్ పెట్టలపైనా సినిమా థియేటర్ స్ర్కీన్లపైనా, బహిరంగ ప్రదేశాల్లో ప్రకటనలు దర్శనమిస్తుంటాయి. అయినా పొగ త్రాగడం ఎవరైనా మానేస్తారా? అంటే ప్రకటనలకు మాత్రమే పరిమితం. స్మోకింగ్.. స్టయిల్ కోసం మొదలై.. క్రమంగా వ్యసనంగా మారుతుంది. కొంతమంది చైన్ స్మోకర్లు.. రోజంతా స్మోకింగ్ చేస్తూనే ఉంటారు. ప్యాకెట్ సిగరేట్లను ఖాళీ చేస్తుంటారు.
పొగ త్రాగితే ఊపిరితిత్తులు చెడిపోతాయని, ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధులు వస్తాయని చెప్పినా ఎలాంటి మార్పు ఉండదు. మందు అయినా మానొచ్చు కానీ, స్మోకింగ్ ఒకసారి అలవాటు అయితే మానడం చాలా కష్టమే. అలాంటి స్మోకింగ్ కారణంగా పొగ పీల్చి.. పీల్చి శరీరంలోని అవయవాలు ఎలా అవుతాయో తెలుసా? ఒక చైన్ స్మోకర్ రోజుకో ప్యాకెట్ చొప్పున 30ఏళ్ల పాటు స్మోకింగ్ చేయడంతో 52ఏళ్లకే ప్రాణాలు కోల్పోయాడు. అతడి ఊపిరితిత్తులు ఎలా మారాయో ఈ షాకింగ్ వీడియో చూడండి.
ఏళ్లతరపడి స్మోకింగ్ చేసిన వ్యక్తికి అవయవ మార్పిడి చేసేందుకు చైనాలోని వైద్యులు నిరాకరించారు. ఎందుకంటే అతడి ఊపిరితిత్తులు అత్యంత ప్రమాదకర స్థితిలోకి మారిపోయాయి. నల్లగా మారిపోయిన ఊపిరితిత్తులను చూసి వైద్యులే షాక్ అయ్యారు. స్మోకింగ్ ఎంత ప్రాణాంతకమో అందరిలో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో చైనా వైద్యులు నల్లగా మారిన ఊపిరితిత్తుల వీడియోను రికార్డు చేసి చైనీస్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోకు 25మిలియన్ల కంటే ఎక్కువగా వ్యూస్ వచ్చాయి. ఇలాంటి యాంటి స్మోకింగ్ యాడ్ ఎన్నడూ చూడలేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఈ వీడియోలో వైద్యులు చెన్ జింగ్యూ తన వైద్యబృందంతో కలిసి నలుపురంగులోకి మారిన ఊపిరితిత్తులను పరీక్షించారు. 30ఏళ్లుగా పొగాకు పీల్చడం వల్ల నల్లగా మారిందని చెప్పారు. ఇలాంటి ఊపిరితిత్తులను అవమాయ మార్పిడికి తిరస్కించినట్టు వైద్యబృందం తెలిపింది. ఒకవేళ.. మీరు కూడా అతిగా స్మోకింగ్ చేస్తున్నారా? మీ ఊపిరితిత్తులు కూడా ఇలానే మారుతాయి జాగ్రత్త. మీరు చనిపోయాక మీ ఊపిరితిత్తులను ఎవరికైనా డొనేట్ చేసినా పనికిరావు.