California : షాపు ఓనర్, అతని అసిస్టెంట్ దొంగ భరతం ఎలా పట్టారో చూడండి

దొంగని పట్టుకోవడం అంటే సాహసమే. ఏ మాత్రం తేడా వచ్చిన వారి చేతుల్లో ఉన్న ఆయుధాలకి పని చెబుతారు. ఓ దొంగకి షాపు యజమాని, అతని అసిస్టెంట్ అస్సలు భయపడలేదు. భరతం పట్టారు.

California : షాపు ఓనర్, అతని అసిస్టెంట్ దొంగ భరతం ఎలా పట్టారో చూడండి

California

Updated On : August 4, 2023 / 3:46 PM IST

California : దొంగను చూడగానే మొదట నోట మాట రాదు. ఏం చేయాలో తోచదు. ఆ టైంలో ఎదురు తిరగే ప్రయత్నం చేయాలని అనిపించినా వారి చేతిలో ఆయుధాలు చూస్తే వణుకు వస్తుంది. కాలిఫోర్నియాలో తన స్టోర్‌లో దొంగతనానికి వచ్చిన ఓ దొంగని మాత్రం ఆ స్టోర్ ఓనర్ ధైర్యంగా ఎదుర్కున్నాడు. పోలీసులు వచ్చేవరకు వెయిట్ చేయకుండా తన అసిస్టెంట్ సాయంతో చితక తన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Brazil : సెల్ ఫోన్‌తో పాటు ఆమె మనసు దోచుకున్న దొంగ.. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ప్రేమ కథ

@rocam54 అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. కాలిఫోర్నియాలో దొంగతనానికి వచ్చిన ఓ దొంగను షాపు యజమాని, అతని అసిస్టెంట్ పట్టుకుని చితక్కొట్టారు. చాలాచోట్ల దొంగలు జనాల్ని బెదిరించి విచ్చలవిడిగా దొంగతనాలు చేసే వీడియోలు చాలా చూసే ఉంటాము. అయితే కాలిఫోర్నియాలోని ఓ దుకాణం యజమాని, అతని అసిస్టెంట్ మాత్రం దొంగ భరతం పట్టాలనుకున్నారు. పోలీసులు వచ్చే వరకు ఎదురుచూడకుండా అసిస్టెంట్ దొంగను పట్టుకుంటే యజమాని కర్రతో దొంగను చితక్కొట్టాడు.

Strange Thieves : వీళ్లెవరో మంచి దొంగల్లా ఉన్నారే.. మీలాంటోళ్లు ఉండాలయ్యా..

నీలంరంగు కవర్‌తో తలను కవర్ చేసిన ఓ వ్యక్తి దుకాణంలో వస్తువులు దొంగిలిస్తున్నట్లు వీడియోలో కనిపించింది. తన వెనుక జేబులో ఉన్న ఆయుధంతో స్టోర్ యజమానిని, అతని అసిస్టెంట్‌ను బెదిరించినట్లు కనిపిస్తుంది. వెంటనే అసిస్టెంట్ దొంగను తన చేతులతో పట్టుకున్నాడు. స్టోర్ యజమాని కర్ర తీసుకుని కొట్టడం మొదలుపెట్టాడు. దొంగ అరుపులతో కొట్టడం ఆపమని వేడుకున్నా ఆపలేదు. ఈ వీడియోను తీసిన వ్యక్తి స్టోరి యజమాని చేసిన పనిని మెచ్చుకోవడం వినిపిస్తుంది. నన్ను విడిచిపెట్టండి.. వెళ్లిపోతాను అని దొంగ వేడుకుంటాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దొంగకు తగిన శాస్త్రి జరిగిందని.. యజమాని మంచి పని చేశాడని నెటిజన్లు కామెంట్లు పెట్టారు.