Brave shopkeeper viral video
Brave shopkeeper viral video : దొంగను చూస్తే ముందుగా హడలిపోతాం. ఇక కత్తితో బెదిరిస్తే పరుగులు తీస్తాం. అయితే ఓ షాప్ కీపర్ షాపులోకి చొరబడ్డ దొంగను ధైర్య సాహసాలతో ఎదుర్కున్నాడు. పోలీసులకు పట్టించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
California : ఒక్క హగ్ బ్యాంక్ దోపిడి ఆపేసింది
Durham Constabulary అనే ఫేస్ బుక్ యూజర్ షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఓ దొంగ కత్తిని తీసుకుని వెళ్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. బీరు ప్యాకెట్ తీసుకుని షాప్ యజమానిని బెదిరించాడు. అటువంటి పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడుకునేందుకు ఎవరైనా పారిపోతారు. కానీ షాపు యజమాని దుకాణం నుండి బయటకు పరుగులు తీసి షాపు తలుపులు మూయడానికి ప్రయత్నిస్తాడు. దొంగ అతని ప్రయత్నాన్ని విఫలం చేయడంతో షాపు యజమాని షెట్టర్‌ను క్లోజ్ చేశాడు అంతే.. దొంగ మధ్యలో ఇరుక్కుపోయాడు. ఇక్కడ విచిత్రమేమిటంటే షెట్టర్ మధ్యలో ఇరుక్కుపోయిన దొంగ బీర్ తాగడానికి ప్రయత్నించాడు.
ఇక పోలీసులు మూడు నిముషాల్లో షాపు వద్దకు చేరుకుని నిందితుడిని అరెస్టు చేశారు. డర్హామ్ క్రౌన్ కోర్టులో కత్తితో బెదిరించి దోపిడికి ప్రయత్నించినందుకు గానూ దొంగకు మూడు సంవత్సరాల నాలుగు నెలలు శిక్ష విధించారట. ఇక దొంగను పట్టించడంలో షాపు యజమాని ధైర్యంగా, చాకచక్యంగా చేసిన ప్రయత్నం అందరి ప్రశంసలు పొందింది.