California : ఒక్క హగ్ బ్యాంక్ దోపిడి ఆపేసింది
తనకు ఎవరూ లేరట. అందుకే దొంగతనం చేసి జైలుకి వెళ్లాలి అనుకున్నాడు ఓ వ్యక్తి. అందుకోసం బ్యాంకు దోపిడికి టార్గెట్ చేశాడు. బ్యాంకులో బెదిరింపులకు దిగిన అతను ఒక్క హగ్‌తో తన దోపిడిని విరమించుకున్నాడు. వింత స్టోరి చదవండి.

California
Hugh stopped the bank robbery : హగ్ వల్ల బ్యాంక్ దోపిడి ఆగిపోవడమేంటి? విచిత్రంగా ఉంది కదూ.. కానీ నిజం. కాలిఫోర్నియాలోని ఓ బ్యాంకు దోపిడి ఒక హగ్‌తో ఆగిపోయింది.
మైఖేల్ ఆర్ముస్ అనే సీనియర్ సిటిజన్ బ్యాంక్ ఆఫ్ ది వెస్ట్‌లో చెక్ డిపాజిట్ చేయడానికి వెళ్లారు. ఆ సమయంలో 42 ఏళ్ల ఎడ్వర్డో ప్లేసెన్సియా అనే వ్యక్తి తనకు డబ్బులు కావాలని ఇవ్వకపోతే తన వద్ద పేలుడు పదార్ధాలు ఉన్నాయని బ్యాంకు సిబ్బందిని బెదిరించడం ఆర్ముస్కి కనిపించింది. అయితే అతని కంఠం విని గతంలో తన ఇంటి ఎదురుగా ఉన్న వ్యక్తిగా ఆర్ముస్ గుర్తించాడు. అంతేకాకుండా అతనిని ముఖం చూస్తే తీవ్రమైన డిప్రెషన్లో ఉన్నట్లు కనిపించాడు. ఓసారి అతనిని దగ్గరకు వెళ్లి ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలుసుకుని దగ్గరకు తీసుకుని హగ్ ఇవ్వాలని అనుకున్నాడు.
ఆర్ముస్ అతని దగ్గరకు వెళ్లి ‘నీకు ఏమైంది ? జాబ్ లేదా ?’ అని ప్రశ్నించాడు. ‘నాకోసం ఈ పట్టణంలో ఏమీ లేదు. అందుకే జైలుకి వెళ్లాలని అనుకుంటున్నాను’ అని చెప్పాడు ప్లేసెన్సియా. అతని సమాధానం విన్న ఆర్ముస్ పోలీసులు వచ్చేలోపు బ్యాంకు బయటకు తీసుకువెళ్లి ఒకసారి ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. అంతే ప్లేసెన్సియా ఏడవడం మొదలుపెట్టాడు. కొద్దిసేపటికి ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దోపిడికి ప్రయత్నించినందుకు ప్లేసెన్సియాను అరెస్టు చేసి జైలుకి తరలించారు. అయితే అతని వద్ద ఎటువంటి పేలుడు పదార్ధాలు పోలీసులకు దొరకలేదు. పోలీసులు ఆర్ముస్ను ప్రశంసించారు.
Caste Discrimination : కుల వివక్ష నిరోధక బిల్లుకు కాలిఫోర్నియా సెనేట్ ఆమోదం
గతంలో ప్లేసెన్సియా తన కూతురి స్నేహితుడిగా ఉన్నాడని అందుకే అతనిపట్ల జాలి కలిగిందని చెప్పాడు ఆర్ముస్. అతను పెద్ద తప్పు చేయకుండా కాపాడటానికే ఆరోజు తనను విధి బ్యాంకుకు రప్పించిందని అన్నాడు. తీవ్రమైన డిప్రెషన్ లో ఉన్న ప్లేసెన్సియా బెదిరింపులతో సరిపెట్టాడు. లేదంటే జీవితకాలం జైల్లో ఉండేవాడు.