Smoking: మీకు ధూమపానం అలవాటుందా? అయితే జాగ్రత్త.. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకులు ఏం చెప్పారంటే?

ధూమపానం అలవాటు ఉన్నవారికి కరోనా సహా ఇతర వైరల్ ఇన్‌ఫెక్షన్ల ముప్పు సాధారణ వ్యక్తులతో పోలిస్తే 12శాతం అధికంగా ఫొంచి ఉంటుందని అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకులు నిర్ధారించారు.

Smoking: మీకు ధూమపానం అలవాటుందా? అయితే జాగ్రత్త.. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకులు ఏం చెప్పారంటే?

Smoking

Smoking: మీకు ధూమపానం అలవాటు ఉందా..? వీలైనంత త్వరగా ఆ అలవాటుకు చెక్ పెట్టండి. లేకుంటే మీ ప్రాణాలకు మీరే ముప్పుతెచ్చుకున్న వారవుతారు. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు.. అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకులు. ధూమపానం అలవాటు ఉన్నవారికి కరోనా సహా ఇతర వైరల్ ఇన్‌ఫెక్షన్ల ముప్పు సాధారణ వ్యక్తులతో పోలిస్తే 12శాతం అధికంగా ఫొంచి ఉంటుందని పరిశోధకులు నిర్ధారించారు.

Bharath Jodo Yatra: భారత్ జోడో యాత్రలో నవ్వులు పూయించిన కర్ణాటక మాజీ సీఎం సిద్ధిరామయ్య పరుగు.. వీడియో వైరల్

ధూమపానం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని అందరికీ తెలిసిన విషయమే. అయినా కొందరు ధూమపానాన్ని వ్యసనంగా మార్చుకుంటున్నారు. తద్వారా ఊపిరితిత్తులు, సంబంధిత వ్యాధుల భారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొవిడ్ మహమ్మారి అనంతరం ధూమపానం అలవాటుఉన్నవారిపై అనారోగ్య ప్రభావం ఎక్కువ ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాజా పరిశోధనల్లో.. ధూమపానం అలవాటు ఉన్నవారికి కరోనా సహా ఇతర వైరల్ ఇన్‌ఫెక్షన్లు ముప్పు సాధారణ వ్యక్తులతో పోలిస్తే 12శాతం అధికంగా పొంచి ఉందని పరిశోధనల్లో తేలింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

అంతేకాదు.. వారు శ్వాసంకోశ సంబంధిత అనారోగ్యం బారినపడే అవకాశాలు 48శాతం ఎక్కువ ఉన్నట్లు గుర్తించారు. ధూమపానం వల్ల వ్యక్తుల్లో కొవిడ్ వ్యాధి తీవ్రత పెరుగుతుందని గతంలో పలు అధ్యయనాల్లో తేలిన విషయం విధితమే.