బాలికను బలవంతంగా ముద్దు పెట్టుకున్న భారతీయుడుకి 7 నెలలు జైలు

  • Publish Date - October 21, 2020 / 11:14 AM IST

Singapore : సింగపూర్‌లో 15 ఏళ్ల బాలికను బలవంతంగా ముద్దుపెట్టుకున్న భారతీయ యువకుడికి అక్కడి న్యాయస్థానం 7 నెలల జైలు శిక్ష విధించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయిన సదరు బాలికను ముద్దు పెట్టుకునేసరికి రచ్చ అయ్యి జైలుకెళ్లాల్సి వచ్చింది.


సింగపూర్ లో సెక్యూరిటీ కోఆర్డినేటర్ గా పనిచేసే 26 ఏళ్ల చెల్లం రాజేశ్ కన్నన్ భార్య, ఓ కూతురు ఉన్నారు. రాజేశ్ కు ఓ సంవత్సరం క్రితం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా 15 ఏళ్ల బాలిక పరిచయం అయింది. అలా ఇద్దరూ చాటింగ్ చేసుకునేవరకూ వెళ్లారు. ఈ క్రమంలో ఇలా చాటింగ్ లేనేంటీ పర్సనల్ గా కలుద్దామనుకున్నారు. అలా గత ఆగస్టులో ఇద్దరూ కలిసారు. ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు. ఆ తరువాత మరోసారి శివారు హౌసింగ్ ఎస్టేట్ అయిన యిషున్ అవెన్యూ 11 వెంట ఉన్న తన హౌసింగ్ అండ్ డెవలప్‌మెంట్ బ్లాక్‌లో కలిసి మాట్లాడుకునేవారు.



https://10tv.in/nashik-prisoner-hangs-himself-note-found-in-body-blames-jail-staff/
ఈక్రమంలో సదరు బాలిక తన ఫ్రెండ్స్ తాను..పార్టీ చేసుకోవాలనుకుంటున్నామనీ మా కోసం మద్యం తీసుకురావాలంటూ రాజేశ్‌ను అడిగింది. దానికి అతను ఒప్పుకుని చెప్పినట్లుగా సెప్టెంబర్ 8న మద్యం బాటిల్స్ తీసుకొచ్చాడు. తరువాత తనకు ముద్దు పెట్టాలని అడిగాడు.దానికి ఆమె ఒప్పుకోలేదు. అలా కలిసినప్పుడు రాజేశ్ ఆమెకు సిగిరెట్ ప్యాకెట్స్ కొనిచ్చేవాడు.


మనం ఫ్రెండ్స్ కాబట్టి నిన్ను అడిగాను..అంతదానికే ముద్దు పెట్టమనటం బాగాలేదు…నేను పెట్టనని చెప్పేసింది.దానికి రాజేశ్ ఒప్పుకోలేదు.దీంతో రాజేశ్ చేతికి చిక్కిన పిల్లనువదలకూడదనుకుని ఆ బాలికను బలవంతంగా ముద్దుపెట్టుకున్నాడు. నువ్వడిగింది ఇచ్చాను నేను అడిగింది కాదనకూడదంటూ ఫిజికల్ రిలేషన్ కోసం బలవంతపెట్టాడు.దీంతో ఆ బాలిక అతడిపై కేసు పెట్టింది.


కేసును విచారించిన కోర్టు నిందితుడికి జిల్లా కోర్టు జడ్జీ షాన్ హో ఏడు నెలల జైలు శిక్ష విధించింది. విచారణ సందర్భంగా రాజేశ్ మాట్లాడుతూ.. చేసిన పనికి సిగ్గుపడుతున్నానని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. తనపై నమోదైన ఈ కేసు వల్ల ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వచ్చిందని..తన కుటుంబంలో కూడా కలతలు వచ్చాయని తాను చేసిది తప్పని తెలుసుకున్నానని వాపోయాడు. తన కక్కుర్తితో తన ఉద్యోగం కూడా పోయిందని, చివరికి భార్యకు రెండే కూతురికి కూడా దూరమయ్యానని ఆవేదన వ్యక్తం చేశాడు.